English | Telugu

క‌మ‌ల్ హాస‌న్ తో వెట్రిమార‌న్ చిత్రం?

త‌మిళ‌నాట వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్నాడు ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్. `ఆడుక‌ల‌మ్`(2011)తో ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా జాతీయ పుర‌స్కారం అందుకున్న వెట్రిమార‌న్.. రీసెంట్ టైమ్స్ లో `విసార‌ణై`, `వ‌డ‌చెన్నై`, `అసుర‌న్` చిత్రాల‌తో మెస్మ‌రైజ్ చేశాడు. ప్ర‌స్తుతం విజ‌య్ సేతుప‌తి, సూరి, గౌత‌మ్ మీన‌న్ కాంబినేష‌న్ లో `విడుద‌లై` చిత్రాన్ని రూపొందిస్తున్నాడు వెట్రిమార‌న్. త్వ‌ర‌లోనే ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ జ‌నం ముందుకు రానుంది. ఈలోపే కోలీవుడ్ స్టార్ సూర్య కాంబినేష‌న్ లో `వాడివాస‌ల్`ని పట్టాలెక్కించ‌బోతున్నాడు.

ఇదిలా ఉంటే.. లోక నాయకుడు క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్ లో వెట్రిమార‌న్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు కోలీవుడ్ బ‌జ్. ఓ న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మ‌రి.. డిఫ‌రెంట్ మూవీస్ తో ఎంట‌ర్టైన్ చేసే క‌మ‌ల్, వెట్రిమార‌న్.. త‌మ ఫ‌స్ట్ కాంబినేష‌న్ లో ఎలాంటి చిత్రంతో మెస్మ‌రైజ్ చేస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, ప్ర‌స్తుతం లోకేశ్ క‌న‌క‌రాజ్ రూపొందిస్తున్న `విక్ర‌మ్`తో బిజీగా ఉన్నారు క‌మ‌ల్. ఇందులో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి, మాలీవుడ్ స్టార్ ఫ‌హద్ ఫాజిల్ ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.