English | Telugu

"ఇంటిలిజెంట్‌"‌లో మార్పు..? చేతులు కాలాకా..!!

కొందరికి చేబితే అర్థమవుతుంది.. మరికొందరికి తనదాకా వస్తేనే అర్థమవుతుందని ఓ ఫేమస్ డైలాగ్.. ఇప్పుడు మెగా హీరో సాయిథరమ్‌ తేజ్‌కి అనుభవంతో బోలెడంత గుణపాఠం వచ్చింది. పెద్ద హీరోల దగ్గరి నుంచి తన తోటి హీరోల దాకా కొత్త వెరైటీలు ట్రై చేస్తుంటే.. మెగా మేనల్లుడు మాత్రం నాలుగు ఫైట్లు, రెండు డ్యూయెట్లు, మూడు కామెడీ సీన్లనే నమ్ముకుని బొక్క బోర్లా పడుతున్నాడు.

ఒక సినిమాకే తెలిసి రావాల్సినప్పటికీ.. మూడు సినిమాలు ఫ్లాపైనా మనోడికి అర్థం కాలేదు. అయితే అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తుండటంతో.. తేజూ‌ మనసు మార్చుకున్నట్లున్నాడని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కరుణాకరన్, మారుతిల దర్శకత్వంలో తాను చేయబోయే సినిమాల్లో.. హీరోయిజాన్ని పక్కనబెట్టి.. కథపైనే ఫోకస్ పెట్టాడని.. ఫిలింనగర్ టాక్. ఇక నుంచి మావయ్యలను అనుకరించడం కాకుండా.. తనకంటూ సొంత స్టైల్ ఉండేలా కేర్ తీసుకోవాలని సాయి భావిస్తున్నాడట. ఇప్పటికైనా తేజూ మారితే సంతోషమే.. లేదంటే మెగా హీరోల్లో చివరి వరుసలో ఉంటాడని సినీ జనాలు అంటున్నారు.