English | Telugu

`హిప్పి` భామ‌తో మాస్ మ‌హారాజా?

ప్రీవియ‌స్ మూవీ `క్రాక్`లో స్టార్ బ్యూటీ శ్రుతి హాస‌న్ తో రొమాన్స్ చేసిన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. కొత్త చిత్రాల విష‌యంలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నారు. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకున్న `ఖిలాడి`లో మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి వంటి అప్ క‌మింగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న ర‌వితేజ‌.. సెట్స్ పై ఉన్న `రామారావు ఆన్ డ్యూటీ`లో దివ్యాంశ కౌశిక్, రాజీషా విజ‌య‌న్ వంటి నాన్ - స్టార్ హీరోయిన్స్ తో క‌లిసి న‌టిస్తున్నారు.

క‌ట్ చేస్తే.. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సినిమాలోనూ ఇదే శైలిని కొన‌సాగించ‌బోతున్నారు. ఇందులో ఇప్ప‌టికే ఓ హీరోయిన్ గా `పెళ్ళి సంద‌D` ఫేమ్ శ్రీ లీల ఎంపిక కాగా.. మ‌రో నాయిక‌గా `హిప్పీ` ఫేమ్ దిగంగ‌న సూర్య‌వంశీ న‌టించ‌బోతోంద‌ని టాక్. అదే గ‌నుక నిజ‌మైతే.. మూడు వ‌రుస సినిమాల్లో ఇద్ద‌రేసి నాన్ - స్టార్ హీరోయిన్స్ తో ర‌వితేజ ఆన్-స్క్రీన్ రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లే. త్వ‌ర‌లోనే ర‌వితేజ - త్రినాథ‌రావు న‌క్కిన కాంబినేష‌న్ మూవీలో నాయిక‌ల‌పై క్లారిటీ రానుంది.

మ‌రి.. స్నేహ‌, అనుష్క ఎలాగైతే ర‌వితేజ సినిమాల‌తోనే తెలుగునాట‌ స్టార్ డ‌మ్ పొందారో.. అదే త‌ర‌హాలో ఈ అర‌డ‌జ‌ను ముద్దుగుమ్మ‌లు కూడా వెళ‌తారేమో చూడాలి.