English | Telugu

చిరు సినిమా అప్పటికంటే కష్టమే!

చిరంజీవి150వ సినిమాలో క‌థానాయిక ఎవరన్నది ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. అనుష్క, నయనతార పేర్లు కొంత కాలం వినిపించాయి. కాని సెట్ కాలేదు. ఇప్పుడు డెడ్ లైన్ ద‌గ్గర ప‌డుతోంది. క‌థానాయిక సెట్లో అడుగుపెట్టాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. దాంతో క‌థానాయిక అన్వేష‌ణ మ‌రింత వేగ‌వంతం చేశారు. అందులో భాగంగా చిత్రబృందం కాజ‌ల్‌ని సంప్రదించిన‌ట్టు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. ఇలా సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తయినా.. ఇంకా హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరనే విషయాల్లో క్లారిటీ లేదు. కానీ సినిమా మాత్రం సంక్రాంతికి విడుదలవుతుందని చెబుతున్నారు. మరో అయిదు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయడమంటే కష్టమే. ఈ సినిమా గనుక సంక్రాంతి బరి నుండి తప్పుకుంటే మిగిలిన హీరోల సినిమాలను రిలీజ్ చేసేసుకోవడం ఖాయం. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!