English | Telugu

చిరు 151వ సినిమా.. 200 కోట్లు

చిరంజీవి అభిమానుల‌కు ఇక నుంచి వ‌రుస‌గా తీపి క‌బుర్లే. బ్రూస్లీలో ఓ గెస్ట్ రోల్ చేసి అభిమానుల‌ను చిరు అల‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వినాయ‌క్ `క‌త్తి` రీమేక్‌కి స‌న్న‌ద్ధం అవుతున్నాడు. ఈలోగా అల్లు అర‌వింద్ కూడా కర్చీఫ్ వేసేశాడు. చిరు త‌దుప‌రి సినిమా కోసం. క‌త్తి పూర్త‌య్యాక చిరుతో మ‌రో సినిమా చేయించ‌డానికి అర‌వింద్ ప్లాన్ చేస్తున్నారు.

చిరంజీవి త‌న కోసం ఓ సినిమా చేస్తాన‌ని మాటిచ్చార‌ని, చిరు ఎప్పుడంటే అప్పుడు ఆ సినిమా మొద‌లెట్టేస్తా అంటున్నారు అర‌వింద్‌. అంతేకాదు.. ఆ సినిమాకి రూ.200 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌డానికి కూడా వెనుకంజ వేయ‌ను అంటున్నారాయ‌న‌. ఎంతైనా బామ్మ‌ర్ది, పైగా అత్యంత ఆప్తుడు అయిన అరవింద్ కి చిరు సినిమా చేసి పెట్ట‌డంలో కొత్తేం లేదు. అయితే ఆ సినిమా బ‌డ్జెట్ రూ.200 కోట్లు అయితే మాత్రం.... అది సౌతిండియ‌న్ రికార్డే!

రెండొంద‌ల కోట్లు అని అర‌వింద్ మాట వ‌ర‌స‌కు అన్నారా, లేదంటే నిజంగానే ఆ స్థాయిలో ఖ‌ర్చు పెట్టించే క‌థ చిరు కోసం సెట్ట‌య్యిందా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి చిరు ఇక వ‌రుస‌గా సినిమాలు చేయ‌బోతున్నాడ‌న్న సంకేతాలు మాత్రం అభిమాల‌కు అందేశాయి. ఇక వాళ్ల‌కు పండగే.. పండ‌గ‌.