English | Telugu

చిరు 150 సినిమా వెనుక బిగ్ బీ?

చిరంజీవి 150వ సినిమా పూరితో చేస్తే బాగుంటుంద‌ని అంద‌రికంటే ముందుగా అడ‌క్కుండానే స‌ల‌హా ఇచ్చాడు రాంగోపాల్ వ‌ర్మ‌. అయితే అంత‌కంటే ముందుగా ఈ కాంబినేష‌న్‌ని ఊహించిందెవ‌రో తెలుసా??. బిగ్ బి అమితాబ్‌బ‌చ్చ‌న్‌. బుడ్డా సినిమాతో బిగ్‌బిని డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కించుకొన్నాడు పూరి. ఆ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా అమితాబ్ హైద‌రాబాద్ వ‌చ్చాడు. హైద‌రాబాద్లో జ‌రిగిన ఆ కార్య‌క్ర‌మానికి చిరంజీవి కూడా హాజ‌ర‌య్యాడు. ఆ స‌మ‌యంలోనే చిరుని మ‌ళ్లీ ఓ సినిమాలో న‌టిస్తే చూడాల‌ని కోరిక‌గా ఉంద‌ని మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టాడు బిగ్‌బీ. ఆ సినిమాకి పూరి ద‌ర్శ‌కుడైతే బాగుంటుంద‌ని స‌ల‌హా కూడా ఇచ్చాడ‌ట‌. ఆ స‌ల‌హాని దృష్టిలో ఉంచుకొనే.. చిరు పూరికి అవ‌కాశం ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని పూరి కూడా సూచ‌న ప్రాయంగా తెలిపారు కూడా. మొత్తానికి చిరు 150వ సినిమా వెనుక బిగ్ బీ హ‌స్తం ఉంద‌ని రూఢీ అయిపోయింది. అన్న‌ట్టు ఈ సినిమాలో బిగ్ బి క‌నిపించే అవ‌కాశాలూ ఉన్నాయ‌ని టాలీవుడ్‌లో టాక్‌. అదే నిజ‌మైతే.. ఆటోజానీ టాక్ బాలీవుడ్ లోనూ వినిపించ‌డం ఖాయం.