English | Telugu
ఉగాదికి `భోళా శంకర్` సందడి!?
Updated : Jul 13, 2022
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. తమిళ సినిమా `వేదాళమ్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఇందులో చిరుకి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా ఎంటర్టైన్ చేయనుంది. చెల్లెలి పాత్రలో కేరళకుట్టి కీర్తి సురేశ్ కనిపించనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ సినిమాకి బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే, సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న `భోళా శంకర్`ని ఉగాది స్పెషల్ గా వచ్చే ఏడాది మార్చి 22న విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, చిరు తాజా చిత్రం `గాడ్ ఫాదర్` విజయదశమి కానుకగా విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో సినిమా అయిన `మెగా 154` 2023 సంక్రాంతికి సందడి చేయనుంది. ఇప్పుడు `భోళా శంకర్` కూడా ఫెస్టివల్ స్పెషల్ గానే రిలీజ్ కానుండడం విశేషం. మరి.. ఈ బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్ రిలీజెస్ తో మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ముంగిట హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.