English | Telugu

అలీకి..ఇద్ద‌రు హీరోయిన్లు బ‌లి

అలీ అంటే వెండి తెర‌పై న‌వ్వులేమోగానీ, బుల్లి తెర‌పై మాత్రం బూతులే. అలీ నోరు విప్పితే చాలు డ‌బుల్ మీనింగులు వ‌రుస క‌డ‌తాయి. యాంక‌రింగు చేసిన‌ప్పుడైతే అలీ త‌న నోరు అస్స‌లు కంట్రోల్‌లో పెట్టుకోడు. ఎదుట ఉన్న‌ది ఎవ‌రున్నా.. ఇష్టం వ‌చ్చిన‌ట్టు కామెంట్లు విసురుతాడు. ఓసారి సుమ ద‌గ్గ‌ర కూడా ఇలానే డ‌బుల్ మీనింగ్ డైలాగులు వ‌ల్లించిన అలీ.. ఆ త‌ర‌వాత త‌ను వార్నింగ్ ఇవ్వ‌డంతో త‌గ్గాడు. ఇప్పుడు మ‌ళ్లీ రెచ్చిపోవ‌డం షురూ చేశాడు.

ఇటీవ‌ల జ‌రిగిన ఓ అవార్డు కార్య‌క్ర‌మంలో అలీ.. బూతు పురాణం మ‌ళ్లీ వినిపంచాడు. ర‌కుల్ ప్రీత్‌సింగ్ అవార్డు తీసుకొంటున్న స‌మ‌యంలో `ఆ సినిమాలో కోసి కారం పెడ‌తాన‌న్నావ్ క‌దా.. ఎక్క‌డా, ఏ కారం.` అంటూ ఎట‌కారంగా అడిగాడు. ముందు అలీ డ‌బుల్ మీనింగ్ ఏంటో అర్థం కాని ర‌కుల్ అలీ మాట‌ల‌కు న‌వ్వేసింది. ఆ మాట‌లు అర్థ‌మ‌య్యాక బుర్ర వెలిగిందేమో.. కాస్త సీరియ‌స్‌గా ఆన్స‌ర్ చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది.

రాశీఖ‌న్నా వేసుకొన్న గౌను గురించి కూడా అలీ ఓ కామెంట్ చేశాడు. పొడుగుగౌన్ వేసుకొచ్చి ఈ హాలంతా తుడిచేశావ్‌.. స్వ‌చ్ఛ్ భార‌త్ కోసం నీవంతు సేవ చేశావ్ అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ స‌ర‌దాగానే ఉన్నా.. రాశీఖ‌న్నా మాత్రం కాస్త ఫీలైంద‌ట‌. అలా.. ఈసారి అలీ ఖాతాలో ఇద్ద‌రు హీరోయిన్లు బ‌లయ్యార‌న్న‌మాట‌. అలీ.. నువ్వు మామూలోడివి కాదుభాయ్‌.