English | Telugu

చిరు 150కి... ముగ్గురు ద‌ర్శ‌కులా??

అదేంటి.. చిరంజీవి 150వ సినిమా వినాయ‌క్ ఒక్క‌డే ద‌ర్శ‌కుడు క‌దా?? మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కులెవ‌ర‌బ్బా??? అనుకొంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఈ సినిమాలో మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌కూ పిలుపొచ్చింది. వాళ్లే.. ప్ర‌భుదేవా, లారెన్స్‌. డాన్స్ మాస్ట‌ర్లుగా మొద‌లై... ఇప్పుడు ద‌ర్శ‌కులుగా స్థిర‌ప‌డ్డారు వీళ్లిద్ద‌రూ. చిరుతో భీక‌ర‌మైన ఎటాచ్‌మెంట్ ఉంది. టాలీవుడ్‌లో ప్ర‌భుదేవా ఎక్కు పాట‌ల‌కు కంపోజ్ చేసింది చిరుసినిమాల‌కే. ప్ర‌భుకు పేరు తీసుకొచ్చిన‌వి కూడా అవే. చిరు శంక‌ర్ దాదా జిందాబాద్ సినిమా తీశాడు ప్రభుదేవా. మ‌రోవైపు లారెన్స్ కూడా ''అన్న‌య్య‌. అన్న‌య్య‌..'' అంటూ చిరుని ఆరాధిస్తుంటాడు. ద‌ర్శ‌కుడిగా మారాక‌.. డాన్స్ డైరెక్ష‌న్ బాగా త‌గ్గించేశాడు లారెన్స్‌. అయితే వీళ్లిద్ద‌రికీ చిరు సినిమా నుంచి పిలుపులు అందాయి. ప్ర‌భుదేవా ఓ పాట‌కూ, లారెన్స్ ఓ పాట‌కూ... డాన్స్ డైరెక్ష‌న్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాలో పాట‌ల‌న్నీ ప్ర‌త్యేకంగా ఉండాల‌ని చిరు భావిస్తున్నాడు. 5 పాట‌ల‌కు గానూ ఐదుగురు డాన్స్ డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించారు. జానీ మాస్ట‌ర్, ర‌ఘు మాస్ట‌ర్‌కీ చిరు నుంచి పిలుపులు అందాయ‌ని టాక్‌.