English | Telugu
మోహన్‌బాబుతో నటించవద్దని సుమలతకు ఏ హీరోయినూ చెప్పలేదు!
Updated : Sep 2, 2021
మోహన్‌బాబు అంటే డిసిప్లిన్‌కు మారు పేరు అనే ముద్ర ఉంది సినీ ఇండస్ట్రీలో. అదే సమయంలో మహా కోపిష్టి అనే పేరు కూడా ఆయనకు ఉంది. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి కొంతమంది హీరోయిన్లు వెనుకాడేవారనీ, భయపడేవారనీ ప్రచారంలోకి వచ్చింది. నిన్నటి తరం అందాల నటి సుమలతకు మోహన్‌బాబు సరసన నటించడానికి అవకాశం వస్తే ఆమె ఫ్రెండ్స్ అయిన తోటి హీరోయిన్లు కొందరు ఆయనతో నటించవద్దని చెప్పారని ఆ రోజుల్లో అనుకొనేవారు.
అయితే అలా తనకు తోటి తారలెవరూ ఆయనతో చెయ్యవద్దని చెప్పలేదని సుమలత వెల్లడించారు. మోహన్‌బాబుతో ఆమె దాదాపు పది సినిమాల్లో నాయికగా నటించారు. మోహన్‌బాబు అంటే ఎవరైనా దడిపిస్తారేమో కానీ, తన అనుభవంలో ఆయన తమ బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరని ఆమె చెప్పారు. "నాకంటే ముందుగా అంబరీష్ (సుమలత భర్త), మోహన్‌బాబు ఒకరికొకరు బాగా తెలుసు. వారు క్లోజ్ ఫ్రెండ్స్. వేరే వాళ్ల ఎక్స్‌పీరియన్స్ గురించి నాకు తెలీదు కానీ, నాకున్న ఎక్స్‌పీరియెన్స్‌లో చెప్పగలను, ఆయన నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరు." అని సుమలత తెలిపారు.
బెంగళూరు నుంచి ఎప్పుడైనా హైదరాబాద్‌కు వచ్చి, తనకు సడన్‌గా ఏదైనా అవసరమైతే, ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఆమె ఫస్ట్ ఫోన్ చేసేది మోహన్‌బాబుకే. సుమలత ఇంట్లో ఫంక్షన్లకు మోహన్‌బాబు కుటుంబం, మోహన్‌బాబు ఇంట్లో ఫంక్షన్లకు ఆమె కుటుంబం అటెండ్ అవుతుంటారు. ఈ విషయాలను సుమలత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కాగా, సుమలత భర్త అంబరీష్ మృతి చెందిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ నియోజక వర్గం నుంచి సుమలత పోటీచేసినప్పుడు ఆమెను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె దేవె గౌడ మనవడు, నటుడు నిఖిల్ గౌడపై ఘనవిజయం సాధించారు.