English | Telugu

స్టార్ హీరోని ప్రేమించి మోసపోయిన హీరోయిన్.. కోట్ల ఆస్థి విద్యార్థులకి దానం

హీరోని హీరోయిన్ ప్రేమిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. ఆ వివాహ బంధం సాఫీగా సాగకపోవడంతో ,విడాకులు తీసుకొని ఒంటరి తనాన్ని భరిస్తుంది. చివరకి అనారోగ్యానికి గురై, చనిపోయే ముందు తన ఆస్థి మొత్తాన్ని దానం చేస్తుంది. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అదే కాన్సెప్ట్ ఒక టాప్ హీరోయిన్ నిజజీవితంలో
జరిగింది.

తమిళ, తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలైన నటి శ్రీ విద్య(Sri Vidhya). బాలనటిగా 'తిరువారుచెల్వన్’తో సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఈ చిత్రంలో శివాజీ గణేశన్ హీరో. ఆ తర్వాత దర్శక దిగ్గజం 'బాలచందర్'(k. Balachander)తో పాటు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో పలు రకాల పాత్రలు పోషించింది. అందం, అందుకు తగ్గ అభినయంతో ప్రేక్షకులని కట్టిపడెయ్యడంతో, సోలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. రజనీకాంత్(Rajinikanth), కమల్ హాసన్(Kamal Haasan),బాలచందర్ ల గ్రేటెస్ట్ మూవీ 'అపూర్వ రాగంగళ్’ లో రజనీ కాంత్ సరసన చేసి, రజనీ ఫస్ట్ హీరోయిన్ అనే టాగ్ లైన్ ని పొందింది. ఆ తర్వాతి కాలంలో దళపతిలో రజనీ కి తల్లిగా కూడా చేసి రికార్డు సృష్టించింది. తన కెరీర్ లో కమల్ హాసన్ తో ఎక్కువ చిత్రాల్లో జత కట్టింది. ఆ సమయంలో వాళ్లిద్దరు ప్రేమలో పడ్డారని, కానీ పెళ్లికి శ్రీవిద్య తల్లి అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. దాంతో 1978లో మలయాళ దర్శకుడు జార్జ్ థామస్‌ ని శ్రీవిద్య వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కొన్నాళ్ల పాటు ఎలాంటి చిత్రాలు చెయ్యలేదు.

కానీ వివాహ బంధంలో శ్రీవిద్య ఫెయిల్ అయ్యింది. జార్జ్ తన ఆస్తిని లాక్కోవడంతో పాటు,తీవ్రంగా వేధించేవాడు. దీంతో 1980లో ఆ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రీవిద్య తన కెరీర్ లో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కలుపుకొని సుమారు ఎనిమిది వందల చిత్రాల వరకు చేసింది. ఏ క్యారక్టర్ చేసినా ఆ క్యారక్టర్ లోకి పరకాయప్రవేశం చేసి తన నటనతో మెస్మరైజ్ చెయ్యడం శ్రీవిద్య స్టైల్ .చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ చిత్రాల్లో తల్లితో పాటు వివిధ పాత్రలు పోషించి తెలుగు వారికి కూడా దగ్గరయ్యింది. 2003 లో క్యాన్సర్ బారిన పడటంతో, తన కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకొని,ప్రముఖ నటుడు, 'ఏంఎల్ ఏ' గణేష్ కుమార్ సహాయంతో, ఒక ఫౌండేషన్‌ని స్థాపించింది. ఆ తర్వాత పేద విద్యార్థులకి కోట్ల రూపాయిల తన ఆస్తిని రాసిచ్చింది ,చివరకి మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్‌తో పోరాడి 2006లో చనిపోగా, అప్పటికి ఆమె వయసు 53 సంవత్సరాలు. శ్రీ విద్య తండ్రి పేరు కృష్ణమూర్తి. హాస్యనటుడుగా పలు చిత్రాలు చేసాడు. తల్లి కర్ణాటక గాయని ఎం.ఎల్. వసంత కుమారి. శ్రీవిద్య ఏడాది వయసున్నప్పుడే కృష్ణమూర్తి ఒక ప్రమాదంలో చనిపోయాడు.