English | Telugu

మహేష్‌బాబుని రిజెక్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.. ఎందుకో తెలుసా?

‘బద్రి’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లోనే పవన్‌కళ్యాణ్‌తో ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంది. మూడు సంవత్సరాల్లోనే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. రేణు నటించిన చివరి సినిమా 2003లో పవన్‌కళ్యాణ్‌ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘జాని’. ఈ సినిమా తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేకప్‌ వేసుకుంది. రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్‌ నాగేశ్వరరావు చిత్రంలో కీలకమైన హేమలత లవణం పాత్రను పోషించింది. 

ఇదిలా ఉంటే.. రేణు దేశాయ్‌కి సంబంధించిన ఒక విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇప్పుడా వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్‌బాబుని రిజెక్ట్‌ చేసిన రేణు దేశాయ్‌. మహేష్‌బాబు వంటి హీరో పక్కన నటించడం అంటే హీరోయిన్లకు బంపర్‌ ఆఫర్‌ అనే చెప్పాలి. అలాంటిది అతన్ని రిజెక్ట్‌ చేసిందంటే కారణం ఏమిటి? బద్రి తర్వాత పవన్‌కళ్యాణ్‌తోనే జాని చేసింది. 2009లో రేణు పెళ్ళి చేసుకున్నప్పటికీ అంతకుముందు నుంచే అంటే 2003 నుంచే వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. ఈ సమయంలోనే మహేష్‌బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘మురారి’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు రేణు దేశాయ్‌ని సంప్రదించాడు పూరి జగన్నాథ్‌. కానీ, మహేష్‌తో నటించేందుకు రేణు ఇష్టపడలేదు. రిజెక్ట్‌ చేసింది. ఆ తర్వాత కూడా మరో సినిమాలో నటించలేదు. అది వేరే విషయం.