English | Telugu
రాజేంద్రప్రసాద్ ని కాపీ కొట్టిన చిరంజీవి
Updated : Oct 26, 2023
ఆ నటుడు నటనకి సంబంధించి ఎన్ని కళలు ఉంటాయో వాటన్నింటిలోను తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో ఎదురులేని కథానాయకుడు. సిల్వర్ స్క్రీన్ మీద ఆ నటుడు కనపడితే చాలు ప్రేక్షకులు ఆనందంతో పూనకం వచ్చిన వాళ్ళల్లా ఊగిపోతారు. ఆయన సినిమా రిలీజ్ అయిన రోజు బ్లాక్ టిక్కెట్లు అమ్మే వాళ్ళకి పండగ రోజు. నెల జీతాన్ని ఒక్క రోజులనే సంపాదించేస్తారు. ఒకటి కాదు రెండు కాదు 40 సంవత్సరాల నుంచి ఆయన సినీ కళామ తల్లి ఒడిలో ఉంటూ ఎన్నో సామజిక సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రం ఆయన్ని చూసే పుట్టిందేమో అనుకునేలా సినిమా ఇండస్ట్రీ లో ఆయన నడవడిక ఉంటుంది. అలాగే ఎంతో మంది సినిమా రంగంలోకి రావటానికి ఇన్స్పిరేషన్ కూడా ఆయనే. ఆయనే మెగా స్టార్ చిరంజీవి. డాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరి ఉన్న చిరంజీవి తన తోటి నటుడికి చెందిన నటన యొక్క ఫార్ములాని కాపీ కొట్టి యాజ్ టీజ్ గా తన సినిమాల్లో ప్రదర్శించాడు. ఈ విషయాన్నీ చిరంజీవే స్వయంగా చెప్పాడు. మరి చిరంజీవి ఫాలో అయిన ఆ నటుడు ఎవరు?
వెండితెర మీద చిరు ప్రదర్శించే నటనని చూసి ఆబాలగోపాలం మొత్తం ఆనందంతో పులకరించిపోతుంది. డాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ లో నెంబర్ వన్ గా ఫర్ఫామెన్స్ ని ప్రదర్శిస్తూ నేటికీ చిరు అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. అలాగే చిరు కామెడీని కూడా సూపర్ గా చేస్తాడు. ఆయన నటించిన ప్రతి సినిమాలో తనదైన బాడీ లాంగ్వేజ్ తో కామెడీలో వీరవిహారం చేస్తాడు. చిరంజీవి డాన్స్ లకి, ఫైట్స్ కి ఎంత మంది అభిమానులు ఉంటారో కామెడీకి కూడా అంతే మంది అభిమానులు ఉంటారు. కామెడీ ని పండించే విషయంలోనే చిరంజీవికి తెలుగు సినీ పరిశ్రమ ఒకప్పటి అగ్ర హీరో అయినటువంటి రాజేంద్రప్రసాద్ స్ఫూర్తిగా నిలిచాడు. ఏ నటుడైనా ఎక్కడా కూడా ఓవర్ డోస్ లేకుండా కామెడీ ని పండించినప్పుడే ఆ కామెడీ ప్రేక్షకులకి నచ్చుతుంది. చిరంజీవి కామెడీలో ఓవర్ డోస్ ఉండదు. ఆ ఓవర్ డోస్ లేకుండా కామెడీ ని పండించడం చిరు రాజేంద్రప్రసాద్ దగ్గరనుంచి నేర్చుకున్నాడు.
ఇక రాజేంద్రప్రసాద్ గారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. తన కెరీర్ మొత్తం కామెడీ సినిమాలనే చేసినా కూడా ఎప్పుడు ప్రేక్షకులకి బోర్ కొట్టని నటుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజేంద్రప్రసాదే అని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఉంటాయి. ప్రజలు సంతోషంగా ఉండటం కోసం రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తూనే ఉంటారు. మన దేశ మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ.నరసింహారావు అభిమాన హీరో అయిన రాజేంద్రప్రసాద్ నుంచి నేను నటనని నేర్చుకున్నానని చెప్పిన చిరంజీవి రియల్లీ గ్రేట్.