English | Telugu
ఒకే రోజు రిలీజైన నాగ్ సినిమాలు.. ఒకదాంట్లో హీరో, మరొకదాంట్లో గెస్ట్!
Updated : Aug 29, 2023
కింగ్ నాగార్జున ఒకే రోజు రెండు సినిమాలతో పలకరించారని తెలుసా? అది కూడా ఒక సినిమాలో హీరోగా.. మరో చిత్రంలో స్పెషల్ రోల్ లో. అయితే, ఇది ఇప్పటి విషయం కాదు. 28 ఏళ్ళ క్రితం నాటి విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో నాగ్ నటించిన మాస్ ఎంటర్టైనర్ 'ఘరానా బుల్లోడు'. ఇందులో నాగ్ కి జంటగా రమ్యకృష్ణ, ఆమని నటించారు. "భీమవరం బుల్లోడా" అంటూ సాగే పాపులర్ పాట ఇందులోదే. 1995 ఏప్రిల్ 27న విడుదలైన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. కమర్షియల్ గా హిట్ స్టేటస్ చూసింది. ఇక అదే రోజు ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'ఘటోత్కచుడు' కూడా విడుదలైంది. అలీ, రోజా జోడీగా కైకాల సత్యనారాయణ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో నాగ్ ఓ స్పెషల్ రోల్, సాంగ్ లో కనిపించారు. ఇక ఇదే మూవీలో రాజశేఖర్, శ్రీకాంత్ కూడా అతిథి పాత్రల్లో మెరిశారు. ఏదేమైనా.. ఒకే రోజున నాగ్ తెరపై దర్శనమిచ్చిన సినిమాలుగా ఘరానా బుల్లోడు, ఘటోత్కచుడు రికార్డులకెక్కాయి. అన్నట్టు.. ఈ రెండు చిత్రాల టైటిల్స్ లో ఆద్యంతాలుగా ఒకే అక్షరాలు ఉండడం మరో విశేషం.
(ఆగస్టు 29.. నాగ్ పుట్టినరోజు సందర్భంగా)