English | Telugu

నాగ్ కి 'ఉత్తమ నటుడి'గా 'నంది'ని అందించిన సినిమాలివే!

కింగ్ నాగార్జున కెరీర్ లో పలు మెమరబుల్ మూవీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని చిత్రాలు తనకి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందించాయి కూడా. ఆ చిత్రాల వివరాల్లోకి వెళితే..


అన్నమయ్య (1997): నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అన్నమయ్య. ఇందులో టైటిల్ రోల్ లో జీవించేశారు నాగ్. అందుకే తన నటనకి ప్రతిష్ఠాత్మక నంది పురస్కారం దక్కింది. ఇక ఇదే చిత్రంతో స్పెషల్ మెన్షన్ కేటగిరిలో జాతీయ పురస్కారం కూడా సొంతం చేసుకున్నారు కింగ్.

సంతోషం (2002): నాగార్జున నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో సంతోషంకి ప్రత్యేక స్థానం ఉంది. 2002లో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం.. నాగ్ కి బెస్ట్ యాక్టర్ గా మరోమారు నందిని అందించింది. అయితే, ఈ అవార్డుని మెగాస్టార్ చిరంజీవి(ఇంద్ర)తో షేర్ చేసుకోవడం విశేషం.

శ్రీరామదాసు (2006): నాగార్జున కెరీర్ లో మరో మెమరబుల్ మూవీ అయిన శ్రీరామదాసు.. బాక్సాఫీస్ ముంగిట వసూళ్ళ వర్షం కురిపించడమే కాకుండా 'ఉత్తమ నటుడు' విభాగంలో నాగ్ కి ముచ్చటగా మూడో నంది పురస్కారాన్ని అందించింది.

వీటితో పాటు స్పెషల్ జ్యూరీ విభాగంలోనూ రాజన్నకి నందిని అందుకున్నారు నాగ్. అలాగే నిర్మాతగా నిన్నే పెళ్ళాడతా, ప్రేమకథ, యువకుడు, మన్మథుడు, రాజన్న చిత్రాలకు కూడా వేర్వేరు విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకున్నారు కింగ్. 

(ఆగస్టు 29.. నాగార్జున పుట్టినరోజు సందర్బంగా)