English | Telugu
చిరంజీవి రిజెక్ట్ చేసాడు..మోహన్ బాబు కెరీర్ కి అదే ప్లస్
Updated : Oct 5, 2023
ఒక్క సినిమా విజయం... అప్పటివరకు వరుస ప్లాప్ సినిమాలతో విసుగెత్తి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న ఆయన్ని ఆపింది. అంతే కాదు ఆ సినిమా విజయానికి ముందు కోట్ల విలువ చేసే ఆస్తులని సైతం అమ్ముకున్న ఆయన చేత తిరిగి అవే ఆస్తులని ఆ సినిమా కొనుక్కునేలా చేసింది.అంతే కాదు ఇంక సినీ పరిశ్రమలో ఆ నటుడ్ని అగ్ర హీరో గా చేసి సినీ పరిశ్రమలో శాశ్వత స్థానాన్ని కూడా ఆ సినిమా కల్పించింది. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.. ఆయనకి అన్ని ఇచ్చిన ఆ సినిమా అసలు ఆయన చెయ్యాలసిన సినిమా కాదు. ఇంకో అగ్ర హీరో చెయ్యాలసిన సినిమా. కానీ ఆయన కథ తనకి సూట్ అవదని చెప్పడం తో ఆ నటుడి వీర విహారం స్టార్ట్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి ? హీరో ఎవరు? వద్దన్న హీరో ఎవరు ?
1990 వ దశకంలో నటప్రపూర్ణ ,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా వచ్చిన అల్లుడుగారు మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఏ ముహూర్తాన మోహన్ బాబు అల్లుడు గారు మూవీ చేసాడో గాని అక్కడి నుంచి సినిమా రంగంలో ఆయన విజయ పరంపర ఒక రేంజ్ లో కొనసాగింది. అది ఎంతలా అంటే తీసిన ప్రతి సినిమా ఆల్ సెంటర్స్ లో సెంచరీ కొట్టింది. సెంచరీ కొట్టడమే కాదు చాలా సెంటర్స్ లో అప్పటి వరకు ఇతర హీరోల పేరు మీద ఉన్న రికార్డ్స్ అన్నిటిని తుడిపేసాయి. అలా కాలక్రమంలో మోహన్ బాబు అల్లుడుగారు విజయం ఇచ్చిన ఉత్సాహం తో అంచలంచలుగా ఎదిగి విద్యాసంస్థలని నెలకొల్పే స్థాయికి వెళ్ళాడు..ఇక అసలు విషయంలోకి వస్థే మోహన్ బాబు హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లుడుగారు మూవీని మొదట చిరంజీవితో చెయ్యాలని రాఘవేంద్రరావు అనుకున్నారు. అనుకున్నదే తడువుగా చిరంజీవిని సంప్రదించడం చిరంజీవి కూడా పాజిటివ్ గా స్పందించడం జరిగింది ఇంక సినిమా పరిశ్రమ మొత్తం ఒకటే చర్చ చిరంజీవి రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఇంకో సినిమా చేయబోతున్నాడని హిట్ కాంబినేషన్ మళ్ళి రెడీ అవుతుందని ఒకటే చర్చ.ఎందుకంటే అప్పుడే చిరంజీవి,రాఘవేంద్రరావు ల కాంబినేషన్ లో అప్పుడే జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ వచ్చి తెలుగు సినిమాకి రికార్డులు అంటే ఎలా ఉంటాయో రుచి చూపించింది.
తిరిగి ఆ రికార్డులని అల్లుడుగారు మూవీ తో బ్రేక్ చెయ్యాలని రాఘవేంద్రరావు అనుకుంటుండగా చిరంజీవి నుంచి కబురు వచ్చింది .అల్లుడు గారు సినిమా చెయ్యనని అందుకు చిరంజీవి కారణాన్ని కూడా చెప్పారు.కథ క్లైమాక్స్ లో ఉరిశిక్షకి తాను జైలుకి వెళ్తే ఫాన్స్ కి నచ్చదని అనడం తో చిరంజీవి నిర్ణయం తో ఏకిభవించిన రాఘవేంద్రరావు క్లైమాక్స్ లో చేంజ్ లు చెందామని అనుకున్న అసలు సినిమా కథ మొత్తం క్లైమాక్స్ మీద ఆధారపడి వుంది కదా అని అనుకున్నారు.
ఇంక ఆ తర్వాత రాఘవేంద్రరావు మోహన్ బాబుని హీరో గా ఎంచుకొని అల్లుడుగారు సినిమా చెయ్యడం జరిగింది. మూగ వాడైన తన కొడుకు మాట్లాడాలంటే ఆపరేషన్ చెయ్యాలని ఆ డబ్బు కోసం జైల్లో ఉన్న మోహన్ బాబు తప్పించుకుంటాడు ఇంకో పక్కన కోటిశ్వరాలు అయిన శోభన అమెరికా నుంచి వస్తున్న తన తండ్రి ఆరోగ్యం కోసం తన భర్తగా నటించేవాడి కోసం చూస్తుంటుంది . ఈ క్రమంలో ఒకరి అవకాశం కోసం ఒకరు మోహన్ బాబు శోభనలు భార్య భర్తలు గా నటిస్తుంటారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య శోభన తండ్రికి తెలియకుండా గొడవలు జరుగుతుంటాయి .ఆ తర్వాత నిజంగానే శోభన మోహన్ బాబు ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది .కానీ మోహన్ బాబు తన గత జీవితం గురించి శోభన కి చెప్తాడు.ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యని అనుకోకుండా తన చేతులతో తానే ఎలా చంపుకున్నాడో చెప్పి తన కొడుకుని శోభనకి అప్పచెప్పి మోహన్ బాబు ఉరిశిక్ష ని అనుభవించడానికి వెళ్లడంతో చిత్రం ముగుస్తుంది. సినిమా ప్రారంభం అయిన గంటన్నర దాకా ఫుల్ కామెడీ జోన్ లో సాగుతూ చివరి అర్ధగంట మాత్రం ప్రేక్షకులకి కన్నీళ్లు తెప్పిస్తుంది.అసలు క్లైమాక్స్ సీన్ లో మోహన్ బాబు ని చూసి కన్నీళ్ళు పెట్టుకొని వారు ఉండరు. అలాగే సినిమా లో ని అన్ని పాటలు కూడా సూపర్ హిట్.ఈ సినిమా లో మోహన్ బాబు శోభన,సత్యనారాయణ ,చంద్రమోహన్ ల నట విశ్వరూపాన్ని చూడవచ్చు.అల్లుడు గారు చిత్రాన్ని మోహన్ బాబే తన లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. మోహన్ బాబు కి అంతటి మంచి సినిమా రావటానికి మెగాస్టార్ చిరంజీవే కారణం కదా..