English | Telugu

చిరంజీవిని తన సినిమాలో వద్దన్న దాసరి 

తెలుగు చలన చిత్ర పరిశ్రమ బతికి ఉన్నంత కాలం దాసరి నారాయణ రావు  అనే పేరు మాత్రం ఎప్పటికి  చిరస్థాయిగా నిలిచిపోయే ఉంటుంది.ఎన్నో మంచి సినిమాలు ఆయన నుండి వచ్చి ప్రేక్షకులని ఎంతగానో రంజింప చేసాయి.అలాగే ఎంతో మంది కొత్తవాళ్ళకి తన సినిమాలో అవకాశాలు ఇచ్చి వాళ్ళ సినిమా కెరియర్ కి ఎంతగానో తోడ్పాటుని అందించారు. అలాగే తెలుగు చిత్ర సీమలో చిరంజీవి కి ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. తనకి మాత్రమే సాధ్యమయ్యే డాన్సులు ఫైట్స్ ,యాక్టింగ్ తో తెలుగు పరిశ్రమలో నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతూ వస్తున్నారు.మరి  చిరంజీవిని  దాసరి నారాయణ రావు తన సినిమాలో వద్దన్నాడన్న విషయం మీకు తెలుసా? కొత్త వాళ్ళని  ప్రోత్సహించి  తెలుగు చిత్ర పరిశ్రమలో వాళ్ళు సుస్థిర  స్థానాన్ని పొందేలా వాళ్ళకి నటనలో మెరుగులు దిద్హేలా చేసే దాసరి చిరంజీవిని తన సినిమాలో ఎందుకు వద్దన్నాడు.
అవి దాసరి నారాయణ రావు దర్శకత్వం లో సినిమా వస్తే చాలు జనం థియేటర్స్ కి ఎగబడి  వెళ్తున్న రోజులు. వరుస హిట్ లతో నెంబర్ వన్ డైరెక్టర్ గా దాసరి అప్రహాతీతంగా ముందుకు  దూసుకుపోతూ సినిమా హీరోయిన్ కధాంశంతో శివ రంజని అనే మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఆ మూవీలో టైటిల్ రోల్ పాత్రలో జయసుధని దాసరి ఫిక్స్ చేసారు. ఇంక తాను రాసుకున్న కథ ప్రకారం జయసుధ సరసన నటించబోయే  హీరో కోసం దాసరి అన్వేషణలో పడ్డారు.కథ డిమాండ్ ప్రకారం హీరో క్యారక్టర్ కి కొత్త కుర్రోడు కావాలని దాసరి ఫిక్స్ అయ్యాడు.హీరో కి సంబంధించి అన్వేషణలో పడిన దాసరికి  తెలిసిన వాళ్ళ ద్వారా ముగ్గురు కొత్త  కుర్రోళ్ళు సినిమాల కోసం ప్రయతిస్తు ఉన్నారని తెలిసింది .దీంతో దాసరి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి కబురు పెట్టారు.

ఇంక ఆ ముగ్గురు కుర్రోళ్ళ విషయాన్ని వస్తే ఆ ముగ్గురు కూరోళ్ళు ఎవరో కాదు. ఒకరు మెగా స్టార్ చిరంజీవి ఐతే ఇంకొకరు కామెడీ యాక్టర్ సుధాకర్ అలాగే హరి ప్రసాద్ .ఈ హరి ప్రసాదే  తర్వాత రోజుల్లో చిరంజీవితో యముడికి మొగుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా ని నిర్మించాడు.ఇంక అసలు విషయంలోకి వస్తే దాసరి తన శివరంజని సినిమా కోసం ముగ్గురు కురాళ్ళ ఉన్నారని తెలిసి చిరంజీవి వాళ్ళకి కబురు పంపాడు.ఆ సమయం లో చిరంజీవి ,సుధాకర్ లు రూమ్ లో  లేరు. హరిప్రసాద్  ఒక్కడే ఉన్నాడు. దాసరి నుంచి కబురు వచ్చిందని తెలిసి హరిప్రసాద్ దాసరి దగ్గరకి వెళ్ళాడు.హరి ప్రసాద్ ని  చూసిన దాసరి తన సినిమా హీరోగా హరి ప్రసాద్ ని ఫిక్స్ చేసుకున్నాడు 

ఆ తర్వాత  చిరంజీవి దాసరి నుంచి కబురు వచ్చిన విషయం తెలుసుకొని దాసరి ని  కలిస్తే దాసరి చిరంజీవి తో హరిప్రసాద్ ని తీసుకున్నానని  చెప్పటంతోచిరు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు .ఇలా దాసరి చిరంజీవిని  తన సినిమాకి వద్దని అన్నాడు.