English | Telugu

భానుమతి 70 ఏళ్ళ క్రితం డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ.. ఏంటో తెలుసా!

తెలుగునాట 'బహుముఖ ప్రఙ్ఞాశాలి'గా గుర్తింపు పొందారు.. భానుమతి. నటీమణిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, గాయనీమణిగా, ఎడిటర్ గా, స్టూడియో ఓనర్ గా.. ఇలా చిత్ర పరిశ్రమలో పలు భూమికలు పోషించి 'అష్టావధాని'గా ప్రత్యేక గుర్తింపు పొందారు. అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రవేశారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 70 ఏళ్ళ క్రితమే ఈ తరహా ప్రయత్నం చేశారు భానుమతి. తను ద్విపాత్రాభినయం చేస్తూ.. కథకురాలిగా, దర్శకురాలిగా 'చండీరాణి' పేరుతో ఓ సినిమా చేశారామె. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సమాంతరంగా తెరకెక్కి 1953 ఆగస్టు 28న ఈ మూవీ జనం ముందు నిలిచింది. నటరత్న నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటించిన ఈ జానపద చిత్రం.. విజయపథంలో పయనించింది కూడా. 

(సెప్టెంబర్ 7.. భానుమతి జయంతి సందర్భంగా..)