English | Telugu
11 ఏళ్ల విరామానంతరం కలుస్తున్న సూపర్‌స్టార్-సూపర్ డైరెక్టర్!
Updated : May 1, 2021
సూపర్‌స్టార్ మహేశ్, మాటల మాంత్రికుడు సూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అతడు' 16 ఏళ్లుగా, 'ఖలేజా' 11 ఏళ్లుగా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి. మళ్లీ ఆ ఇద్దరూ ఎప్పుడు కలిసి పనిచేస్తారా అని ఎదురుచూస్తున్న అభిమానుల కోరికను తీరుస్తూ ఆ ఇద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. 11 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ సూపర్ క్రేజీ కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ రానున్నదనే వార్త అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అఫిషియల్‌గా ఆ క్రేజీ కాంబినేషన్ ఫిల్మ్‌ను ప్రకటించారు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ. ఆ బ్యానర్‌లో మహేశ్ పనిచేయనున్న తొలి చిత్రం ఇదే. మే 31 సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో ఈ #SSMB28 సినిమా ప్రారంభం కానున్నది. 2022 సమ్మర్ స్పెషల్‌గా రిలీజవుతుంది. ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలతో మహేష్-త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
ప్రస్తుతం చేస్తున్న 'సర్కారు వారి పాట' తర్వాత మహేశ్, 'అల.. వైకుంఠపురములో' మూవీ తర్వాత త్రివిక్రమ్ పనిచేసే సినిమా ఇదే.