English | Telugu

ఏయన్నార్ 'పునర్జన్మ'కి 60 ఏళ్ళు.. నాగ్ బర్త్ డే స్పెషల్ మూవీ!

నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పలు నవలాధారిత చిత్రాల్లో సందడి చేశారు. వాటిలో 'పునర్జన్మ' ఒకటి. 'పత్థర్ కే హోంఠ్' అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి కె. ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు. ఇందులో ఏయన్నార్ కి జంటగా కృష్ణ కుమారి దర్శనమివ్వగా.. రమణారెడ్డి, గుమ్మడి, పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, చదలవాడ, సూర్యకాంతం, హేమలత, ఎల్. విజయలక్ష్మి, సంధ్య, వాసంతి, నిర్మలమ్మ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. 

టి. చలపతిరావు సంగీతమందించిన ఈ చిత్రానికి శ్రీ శ్రీ, దాశరథి, కొసరాజు, సి. నారాయణరెడ్డి సాహిత్యమందించారు. ఇందులోని "ఎవరివో నీవెవరివో", "దీపాలు వెలిగే", "నీ కోసం" (రెండు వెర్షన్స్), "పూలు విరిసెను", "మనసు తెరిచి చూడు" అంటూ మొదలయ్యే పాటలు ఆకట్టుకున్నాయి. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవీ సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రం.. హిందీలో 'ఖిలోనా' (1970), తమిళంలో 'ఎంగిరుదో వందాళ్' (1970), మలయాళంలో 'అమృతవాహిని' (1976) పేర్లతో రీమేక్ అయింది. ఏయన్నార్ తనయుడు, కింగ్ నాగార్జున 4వ పుట్టినరోజు సందర్భంగా 1963 ఆగస్టు 29న 'పునర్జన్మ' జనం ముందు నిలిచింది. మంగళవారంతో ఈ జనరంజక చిత్రం 60 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.