Read more!

English | Telugu

ప్రముఖ హీరో హీరోయిన్ కూతురుని కరిచిన  కుక్క..నితారా  రెస్పాన్స్ అమోఘం 

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన శ్రీను అనే చిత్రంలో నటించి తన నటనతో అందంతో ప్రేక్షకులని మైమరింప చేసిన నటి ట్వింకిల్ ఖన్నా. ఆ తర్వాత ఆమె పలు హిందీ చిత్రాల్లో నటించి ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ని వివాహం చేసుకుంది. తాజాగా ఆమె తన కూతురుకి సంబంధించి చెప్పిన  ఒక న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.  

ట్వింకిల్, అక్షయ్  దంపతులకు  21 సంవత్సరాల వయసు కలిగిన  కొడుకు నీరవ్ తో పాటు 11  సంవత్సరాల వయసు ఉన్న   కూతురు నితారా  ఉన్నారు. మొన్న క్రిస్మస్ రోజున  ఎవరో పొరపాటున వాళ్ళ ఇంట్లో ఉండే కుక్క పిల్ల ఫ్రెడ్డీ కోసం ఒక ప్లేట్ లో చికెన్ పెట్టారు .కానీ ఆ చికెన్ కి వెదురు పుల్లలలాంటివి తగిలించి ఉన్నాయి. ఫ్రెడ్డీ చికెన్ తినటం ప్రారంభించింది.ఇది గమనించిన నితారా వెంటనే ఫ్రెడ్డీ గొంతులో పుల్లలు ఇరుక్కొని  ఎక్కడ తనకి  హాని కలుగుతుందేమోనని తన నోట్లో చేతులు పెట్టి నితారా పిల్లలు తీసేసింది.ఆ సమయంలో ఫ్రెడ్డీ నితారా చేతులు కొరికింది.

ఆ సంఘటనతో వెంటనే ట్వింకిల్, నితారా కి రేబిస్, టెటానట్ ఇంజక్షన్ చేయించింది. పైగా ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే నితారా తనని ఫ్రెడ్డీ  గాయపరిచిందనే విషయాన్ని పక్కన పెట్టి ఫ్రెడ్డీ కి  ఏమవ్వనందుకు  సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ ట్వింకిల్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది.ట్వింకిల్ ప్రస్తుతం సినిమా నిర్మాతగా మారి కొన్ని చిత్రాలని నిర్మించింది. రచయిత్రిగా కొన్ని  పుస్తకాలు కూడా ఆమె రాసింది.