Read more!

English | Telugu

69 వ ఫిలింఫేర్ అవార్డులు..భార్యభర్తలిద్దరు ఉత్తమ నటుడు ఉత్తమ నటి


 

ఒక సినిమా విజయవంతమైనప్పుడు ఆ సినిమాకి పని చేసిన 24  క్రాఫ్ట్స్ వాళ్ళు ఎంత ఆనందపడతరో ఆ సినిమాకి  ఏదైనా అవార్డు వస్తే అంతే ఆనందపడతారు. పైగా ఆ సినిమాకి భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఎంతో అత్యున్నతమైనదిగా భావించే అవార్డు వస్తే ఇంక  వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు.

గుజరాత్ క్యాప్టిల్  గాంధీనగర్ లో నిన్న రాత్రి 69 వ ఫిలింఫేర్ అవార్డు వేడుక అత్యంత ఘనంగా జరిగింది. బాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరు పాల్గొన్న ఈ సినీ ఫెస్టివల్ లో  ఏ ఏ శాఖలో ఎవరెవరు అవార్డ్స్ దక్కించుకున్నారో  చూద్దాం. ఉత్తమ చిత్రంగా 12త్ ఫెయిల్ ,ఉత్తమ  దర్శకుడుగా  విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్) లు  దక్కించుకున్నారు.ఇక  మేల్ కేటగిరిలో ఉత్తమ నటుడుగా యానిమల్ చిత్రంలో అధ్బుతమైన నటనని  కనపరిచినందుకు గాను  రణబీర్ కపూర్ అందుకోగా   ఫీమేల్ లీడ్ లో ఉత్తమ నటిగా ఆయన సతీమణి  అలియా భట్ అందుకోవడం విశేషం. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రానికి గాను ఆమె ఆ అవార్డు ని అందుకున్నారు.ఇక సపోర్టింగ్ కేటరింగ్ లో ఉత్తమ నటుడు గా విక్కీ కౌశల్  డంకీ చిత్రానికి  అందుకోగా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రానికి అదే కేటగిరి ఫిమేల్ లో  ఉత్తమ నటిగా షబానా అజ్మీ  నిలిచారు.

ఇక  ఉత్తమ నటనా  విమర్శకుల కోటాలో  రాణి ముఖర్జీ ,షెఫాలీ షా లు  మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే ,మేము ముగ్గురం లకి  అందుకున్నారు. ఉత్తమ సాహిత్యంకి  అమితాబ్ భట్టాచార్య (తేరే వాస్తే – జరా హాట్కే జరా బచ్కే) బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ అనిమల్  (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, జానీ, భూపీందర్ బబ్బల్, అషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురీందర్ సీగల్) ఉత్తమ నేపథ్య గాయకుడు మేల్ కేటగిరిలో  భూపిందర్ బబ్బల్ (అర్జన్ వైలీ – అనిమల్ , ఉత్తమ నేపథ్య గాయనిగా  శిల్పా రావు (బేషారం రంగ్ – పఠాన్) ఉత్తమ కథ  అమిత్ రాయ్ (ఓ మై గాడ్ 2), దేవాశిష్ మఖిజా (జోరం) ఉత్తమ స్క్రీన్ ప్లే  విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్) బెస్ట్ డైలాగ్ ఇషితా మోయిత్రా (రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ) బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  హర్షవర్ధన్ రామేశ్వర్ (అనిమల్) ఉత్తమ సినిమాటోగ్రఫీ  అవినాష్ అరుణ్ ధావారే (త్రి ఆఫ్ అస్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్  సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్  సచిన్ లవ్లేకర్, దివ్వ్యా గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్) ఉత్తమ సౌండ్ డిజైన్ – కునాల్ శర్మ (సామ్ బహదూర్) సింక్ సినిమా (అనిమల్) బెస్ట్ ఎడిటింగ్ జస్కున్వర్ సింగ్ కోహ్లీ- విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్) బెస్ట్ యాక్షన్  స్పిరో రజాటోస్, అన్ల్ అరసు, క్రెయిగ్ మాక్‌రే, యానిక్ బెన్, కెచా ఖంఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్) ఉత్తమ విఎఫ్ఎక్స్  రెడ్ చిల్లీస్ విఎఫ్ఎక్స్ (జవాన్) ఉత్తమ కొరియోగ్రఫీ – గణేష్ ఆచార్య (వాట్ జుమ్కా,  రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ) బెస్ట్ డెబ్యూ డైరెక్టర్  తరుణ్ దుడేజా (ధక్ ధక్) బెస్ట్ డెబ్యూ జెంట్స్ కేటగిరిలో   ఆదిత్య రావల్ (ఫరాజ్) బెస్ట్ డెబ్యూ ఫిమేల్ అలిజే అగ్నిహోత్రి (ఫరే)

 

ఉత్తమ సినీ విమర్శకులు గా  జోరామ్ (దేవాశిష్ మఖియా )ఉత్తమ నటుడు విమర్శకుల కోటాలో  విక్రాంత్ మాస్సే (12త్ ఫెయిల్) లు అందుకున్నారు.ఇక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ని ప్రముఖ దిగ్గజ దర్శకులు  డేవిడ్ ధావన్ అందుకున్నాడు. కరణ్ జోహార్, ఆయుష్మాన్ ఖురానా అండ్ మనీష్ పాల్ హోస్ట్ చేసిన ఈ గ్రాండ్ ఈవెంట్ లో అనేకమంది స్టార్స్ స్పెషల్ పెర్ఫామెన్స్ ఇచ్చి 69 వ ఫిలింఫేర్ ని ఆధ్యంతం కన్నుల పండుగల నిలిచేలా చేసారు.