Read more!

English | Telugu

సల్మాన్ ఖాన్ టైగర్ 3 ని దెబ్బకొడుతున్న 11 మంది

సల్మాన్ ఖాన్ తాజా చిత్రం టైగర్ 3 ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది.దీపావళి కానుకగా 12  న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన టైగర్ తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ ని రాబట్టుకుంది.కలెక్షన్స్ ని కూడా ఏ రోజుకా రోజు పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న టైగర్ 3 కి ఇప్పుడు గట్టి దెబ్బ తగిలింది.

టైగర్ 3  సినిమా మొదటి రోజు 44 .5 కోట్ల రూపాయలని సాధించింది. రెండవ రోజు 52  కోట్లుని మూడవ రోజు 48 కోట్లుని సాధించింది. కానీ నిన్న 
 జరిగిన ఇండియా న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్  టైగర్ 3  కలెక్షన్స్ మీద ప్రభావం చూపించింది. సెమీ ఫైనల్ మ్యాచ్ కావడంతో ఇండియన్స్ మొత్తం టీవీ లకి అతుక్కొనిపోవడం వల్ల  టైగర్ 3  కేవలం 23 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇప్పుడు  ఇండియా ఫైనల్ కి చేరింది కాబట్టి ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా టైగర్ 3 కలక్షన్స్ కి  భారీగానే గండి కొట్టే అవకాశం ఉంది. 

 

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ టైగర్ 3  చిత్రంలో సల్మాన్ ,కత్రినా కైఫ్ లు  సూపర్ గా నటించారు. మొదటి రెండు సిరీస్ ల కంటే టైగర్ 3  చాలా బాగుందని మూవీ చూసిన ప్రతి ఒక్కరు  అంటున్నారు. షారుక్,హృతిక్ రోషన్ లు  కూడా అతిధి పాత్రల్లో మెరిసి టైగర్ 3  విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.