English | Telugu

లైఫ్ సర్కిల్ గురించి స‌న్నీలియోన్ కామెంట్స్‌

శృంగార తార ఇమేజ్‌తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన స‌న్నీ లియోన్ క్ర‌మంగా మంచి సినిమాలు, స్పెష‌ల్ సాంగ్స్‌లో నటిస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది. ఓ వైపు బాలీవుడ్ సినిమాల‌తో పాటు ద‌క్షిణాది చిత్రాల్లోనూ ఆమె న‌టించింది. తాజాగా ఓ సంద‌ర్భంలో ఆమె త‌న సినీ ప్ర‌యాణం గురించి మాట్లాడే సంద‌ర్బంలో జీవితం ఓ చ‌క్రంలా ఉంద‌ని గుర్తు చేసుకుంది. అందుకు ఆమె వివ‌ర‌ణ కూడా ఇచ్చుకుంది. హిందీ బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఆమె గెస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ స‌మ‌యంలో ఆమెకు ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత మ‌హేష్ భ‌ట్ జిస్మ్ 2 సినిమా ఆఫ‌ర్ ఇచ్చారు. అలా ఆమె కెరీర్ మొద‌లైంది.

ఎరోటిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన జిస్మ్ 2 సినిమా క‌థ‌ను మ‌హేష్ భ‌ట్ రాయ‌గా, ఆయ‌న కుమార్తె పూజా భ‌ట్ డైరెక్ట్ చేసింది. ఈ సినిమాలో అవ‌కాశం ఆమెకు అనుకోకుండా వ‌చ్చింది. బిగ్ బాస్ సీజ‌న్ 5లో కంటెస్ట్ చేసిన‌ప్పుడు మ‌హేష్ భ‌ట్ ఆమెను క‌లిసి అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజ‌న్ 2 ర‌న్ అవుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. ఇప్పుడు ఇందులో పూజా భ‌ట్ కంటెస్టెంట్‌గా ఉంది. ఈ సంద‌ర్భంపై స‌న్నీలియోన్ స్పందిస్తూ జీవితం అంతే ఓ చ‌క్రం అంటూ కామెంట్స్ పాస్ చేసింది. ఆమె చెప్పిన దాంట్లోనూ నిజం లేక‌పోలేద‌నే చెప్పాలి. బిగ్ బాస్ ఓటీటీ 2 కి కూడా స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

బిగ్ బాస్‌లో ఎంట్రీ గురించి స‌న్నీలియోన్ మాట్లాడుతూ ``నేను బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లిన సీజ‌న్‌లో విన్న‌ర్‌, ర‌న్న‌ర్‌కి ఏం వ‌చ్చింది.. ఎంత వ‌చ్చింద‌నేది నాకు తెలియ‌దు. కానీ నాకు మాత్రం బాగానే డ‌బ్బులు వ‌చ్చాయి. ముందు నేను బిగ్ బాస్‌లోకి వెళ్ల‌కూడ‌ద‌నే అనుకున్నాను. అయితే అక్క‌డ‌కి వెళ్లిన‌ప్పుడు ఇత‌ర కంటెస్టెంట్స్‌, ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకోవాల‌నిపించి వెళ్లాను. అప్పుడే పెళ్లి చేసుకున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే డ‌బ్బు కావాల‌నే ఉద్దేశంతో బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాను`` అన్నారు.