English | Telugu

అది ఒప్పుకుంటే సైన్ చేస్తా.. ఆమెది వేశ్య పాత్ర 

మీరు మా సినిమాలో హీరోయిన్ గా చేస్తారా! భలే వాళ్లే ఎందుకు చెయ్యనండి. కాకపోతే  నేను చెప్పిన కండీషన్స్ కి ఒకే అంటేనే  సైన్ చేస్తా. అదేనండి సినిమాకి ఓకే చెప్పడం. బాలీవుడ్ అగ్ర నటి సోనాక్షి సిన్హా తీరు మొదటి నుంచి ఇంతే. మరి ఆమె  కండీషన్స్ ఏంటో చూద్దాం

ఒకప్పటి  బాలీవుడ్ అగ్ర హీరో శత్రుఘ్న సిన్హా కూతురే సోనాక్షి సిన్హా. తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని దశాబ్దంన్నర నుంచి తనదైన ముద్రతో ముందుకు దూసుపోతుంది. దాదాపుగా ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాయి. నటిగా కూడా మంచి  పేరు తీసుకొచ్చాయి. లేటెస్ట్ గా హీరా మండి అనే వెబ్  సిరీస్ లో చేసింది. దానికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ లో ప్రసారం అయ్యే కపిల్ షో లో పాల్గొంది. ఈ సందర్భంగా  పలు విషయాలని వెల్లడించింది. ఒక సినిమా ఒప్పుకునే ముందు ఎలాంటి బోల్డ్ సీన్స్ లో గాని ముద్దు సన్నివేశాల్లో గాని నటించనని చెప్తాను. కెరీర్ ప్రారంభం  నుంచి ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాను. అందుకు దర్శక నిర్మాతలు  అంగీకారం తెలిపితేనే సినిమా ఒప్పుకుంటాను. ఒక వేళ ఒప్పుకొని పక్షంలో  సినిమా నుంచి అయినా తప్పు కుంటాను.అంతే కానీ  అసభ్యకర సన్నివేశాల్లో నటించను. తన కెరీర్ చివరి దాకా ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పుకొచ్చింది

2010 లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్ ఆమె మొదటి సినిమా..రౌడీ రాథోడ్ , సన్ ఆఫ్ సర్ధార్, దబాంగ్ పార్ట్ సెకండ్ యాక్షన్ జాక్సన్, తీవార్, బుల్లెట్ రాజా, అకిరా, ఫోర్స్, డబుల్ ఎక్సల్, లుతేరా, నూర్, వెల్కమ్ తో న్యూ యార్క్, ఇలా దాదాపుగా ముప్పై చిత్రాల్లో నటించింది. అన్నింటిలోను ఎలాంటి ముద్దు సన్నివేశాల్లో చెయ్యలేదు. తమిళంలో రజని కాంత్ తో కలిసి ఒక మూవీ కూడా  చేసింది. హీరామండి  నెట్ ఫ్లిక్స్ లో మే 1 నుంచి  స్ట్రీమింగ్ అవుతుంది.అందులో సోనాక్షి  వేశ్య పాత్రలో నటించడం గమనార్హం