English | Telugu
వేశ్యలలో నిగూడ శక్తీ ఉంటుంది... అందుకే వాళ్ళతోనే చేస్తా
Updated : May 20, 2024
నేను సినిమా తెరకెక్కించాలంటే వేశ్యలు సెక్స్ వర్లర్లు మాత్రమే కావాలి. చిన్నప్పటినుంచి వాళ్లే నాకు ఇనిస్పిరేషన్. నా ప్రతి సినిమాలో వాళ్ళు ఉంటారు. అంతే గాని రేషన్ కోసం క్యూ లో నుంచోనే ఆడవాళ్లు నాకు అవసరం లేదు.ఈ మాటలన్నీ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి(sanjay leela bhansali)చెప్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటో పూర్తిగా చూద్దాం
భారతీయ సినిమా గర్వించదగిన దర్శకుల్లో సంజయ్ లీలా బన్సాలి కూడా ఒకరు.ఇందులో ఎవరకి ఎలాంటి డౌట్ లేదు. రీసెంట్ గా హీరామండి(heeramandi ది డైమండ్ బాజార్ అనే ఒక వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు. ప్రస్తుతం అది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ చిత్ర కథ వేశ్య వృత్తి( Prostitute profession)చేసుకునే ఆడవాళ్ళ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న భన్సాలీ ని మీ సినిమాల్లో ఎక్కువ భాగం వేశ్య వృత్తి చేసుకునే ఆడవాళ్ళ గురించే ఉంటాయేందుకనే ప్రశ్న అడిగారు. సెక్స్ వర్కర్ల పాత్రలని వెండి తెరపై ఆవిష్కరించడం నాకు ఎంతో ఆసక్తి . ఆ వృత్తుల్లో ఉన్న మహిళలు అంతులేని రహస్యాలకి చిరునామా.అలాగే వేశ్య వృత్తిలో అందరి కంటే ఉన్నత స్థానంలో ఉన్న మహిళ లో నిగూడ శక్తీ దాగి ఉంటుంది. చాలా గమ్మత్తుగా ఉండటంతో పాటు పాడగలరు, డాన్స్ చేయగలరు.అమితమైన ఆనందాన్ని పొందటం కోసమే వాళ్ళు అలా చేస్తారు. కళాత్మకంగా జీవిస్తూ తమ భావాలని చాలా ఈజీగా కూడా వ్యక్తం చేస్తారు. తాము ఉండే ప్రాంతానికి, దుస్తులకి, అభరణాలకి విశేష ప్రాముఖ్యతని ఇస్తారు. మంచి రస హృదయులు కూడాను. మీరు వాళ్ళని ఏ పేరుతో పిలిచినా పరవాలేదు.నా సినిమాకి మాత్రం వాళ్లే కావాలి. ఇలా వేశ్యల పై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. నా చిన్న తనంలో స్కూల్ కి వెళ్తున్నప్పుడు రేషన్ కోసం క్యూ లో నుంచోనే మధ్య తరగతి మహిళలని చూసేవాడిని కానీ వారి కంటే వేశ్యల పట్లే తనకి ఆకర్షణ ఎక్కువ అని కూడా చెప్పుకొచ్చాడు.
రాశి కన్నా వాసి కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే బన్సాలి మూడు దశాబ్దాల తన సినీ కెరీర్ లో కేవలం పన్నెండు చిత్రాల కి మాత్రమే దర్శకత్వం వహించాడు. 1994 లో రైటర్ గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఖామోషి, హమ్ దిల్ కే చుప్ కే సనమ్, దేవదాస్, బ్లాక్,గుజారిష్,బాజీరావు మస్తానీ, పద్మావత్, గంగూబాయి ఖైతావాడి లాంటి ఆయన నుండి వచ్చినవే. కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు