English | Telugu

కియారాను వెల‌క‌ట్ట‌లేని నిధిగా పోల్చిన సిద్ధ్‌

నా భార్య నా జీవితంలో వెల‌క‌ట్ట‌లేని సంప‌ద‌. ఆమె నా అదృష్ట‌దేవ‌త‌. ఆమె అస‌మాన్య‌మైన నిధి అంటూ మ‌న‌సారా కియారాను పొగుడుతున్నారు భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. ఇటీవ‌ల పెళ్లి చేసుకుని ఒకింటివార‌య్యారు సిద్ధార్థ్, కియారా. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు కియారా. కొన్నేళ్లుగా ప్రేమ‌లో ఉన్నారు సిద్ధార్థ్‌, కియారా. వారిద్ద‌రూ న‌టించిన షేర్‌షా చూసి జ‌నాలు వావ్ అన్నారు. స్క్రీన్ మీద అంత అద్భుతంగా పండింది వారి కెమిస్ట్రీ. రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌ల‌య్యాక నెట్టింట్లో నాన్‌స్టాప్‌గా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తాయి ఈ జంట‌కు. ఇటీవ‌ల ముంబైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా పాల్గొన్నారు. అక్క‌డే పెళ్లి గురించి, భార్య గురించి మాట్లాడారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ `` నా దృష్టిలో పెళ్లి అనేది చాలా ఇంట్ర‌స్టింగ్ గేమ్‌. ఇద్ద‌రు ఆడే ఆట పెళ్లి. ఇక్క‌డ గెలుపు ఆమెదా? నాదా? అనే ప్ర‌శ్న‌లుండ‌వు. అస‌లు పెళ్ల‌యిన త‌ర్వాత నేను, తాను అనే మాట‌ల‌కే అవ‌కాశం ఉండ‌దు. మేము, మ‌న‌ము అనే ప‌దాలే ఉంటాయి. గేమ్‌లో ఎక్క‌డైనా ఒక్క‌రే విన్ అవుతారు. కానీ వివాహ‌మ‌నే గేమ్‌లో ఇద్ద‌రూ ఆడ‌తారు. ఇద్ద‌రూ పోటీప‌డ‌తారు. ఇద్ద‌రూ గెలుస్తారు. నేను ఆ గెలుపును న‌మ్ముతాను. నాకు కియారా అంటే చాలా ఇష్టం. ఆమె నాకు ద‌క్కిన అద్భుత‌మైన నిధి`` అని అన్నారు.

పెళ్లి త‌ర్వాత కియారాకు మంచి హిట్లు ప‌డుతున్నాయి. జీ లే జారాలో ప్రియాంక చోప్రా న‌టించాల్సిన పాత్ర ఇప్పుడు కియారా త‌లుపుత‌డుతోంది. ఆలియా, క‌త్రినాతో క‌లిసి ఆ సినిమా చేయాలా, వ‌ద్దా అని నిర్ణ‌యించాల్సింది మాత్రం కియారానే. సిద్ న‌టిస్తున్న యాక్ష‌న్ మూవీ ఇయ‌ర్ ఎండింగ్‌కి వాయిదా ప‌డింది. ప‌ర్స‌న‌ల్ స్పేస్‌లో హ్యాపీగా ఉన్న ఇద్ద‌రూ, ప్రొఫెష‌న‌ల్‌గా ఎవ‌రి బిజీలో వాళ్లున్నారు.