English | Telugu
ఆండ్రియా న్యూడ్ సీన్స్ తీసేశారా!
Updated : Jul 12, 2023
షో బిజ్‌లో బోల్డ్ గా కనిపించే నటీమణుల్లో ఆండ్రియా జెరీమియా ఒకరు. ఆమె ఏ సినిమా చేసినా సెన్సేషనే. ఏదో స్పెషాలిటీ ఉంటేగానీ మేకర్స్ ఆమెను అప్రోచ్ అవ్వరు. ఆ స్పెషాలిటీ నచ్చితేగానీ ఆండ్రియా ఓకే చెప్పరు. ఇన్నేళ్లుగా తనకంటూ ఓ స్పెషల్ స్టైల్‌ని ఫాలో అవుతున్నారు ఆండ్రియా జెరీమియా. ఇప్పుడు ఆమె ఓ టాపిక్‌తో ట్రెండ్ అవుతున్నారు. పిసాసు 2లో నటించారు ఆండ్రియా జెరీమియా.
ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని ఆడియన్స్ కి తన సినిమాల ద్వారా చెప్పాలనుకుంటారు డైరక్టర్ మిస్కిన్. ఆయనతో కలిసి ఆండ్రియా చేసిన సినిమా పిసాసు2. 2014లో రిలీజ్ అయిన సెన్సేషనల్ సినిమాకు ఇది సీక్వెల్. హారర్ ప్రధానంగా సాగుతుంది ఈ మూవీ. ఈ సినిమాలో ఆండ్రియా న్యూడ్‌గా నటించారంటూ ఆల్రెడీ వార్తలు స్ప్రెడ్ అయ్యారు. 2018లో విడుదలైన వడ చెన్నై మూవీలో టాప్‌లెస్ సీన్ చేశారు ఆండ్రియా. వెట్రిమారన్ డైరక్షన్‌లో ఆ సీన్లు చేయడానికి అప్పట్లో తాను కంఫర్ట్ గానే ఫీలయ్యానని బోల్డ్ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు.
ఈ మధ్య పిసాసు2లో ఆండ్రియా నగ్నంగా నటించారని వార్తలు వచ్చినప్పుడు కూడా, వెంటనే వడ చెన్నై మూవీని గుర్తుచేసుకున్నారు మూవీ లవర్స్. పిసాసు2కి సెన్సార్ నుంబి అభ్యంతరాలు వచ్చాయట. లోదుస్తులు కూడా లేని సన్నివేశాలను ఆమె అనుమతితోనే చిత్రీకరించామని చెప్పినప్పటికీ సెన్సార్ అనుమతించలేదట. అందుకే ఆ సీన్లను ట్రిమ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్టు వినికిడి. అయితే లేటెస్ట్ గా ఈ విషయం గురించి స్పందించారు డైరక్టర్ మిస్కిన్. మిస్కిన్ మాట్లాడుతూ ``మా సినిమా సెన్సార్ పనులు పూర్తి అయ్యాయి. మా సినిమాకు ఎలాంటి కట్స్ చెప్పలేదు. ఏ డైలాగ్‌ని మ్యూడ్ చేయలేదు. అసలు ప్రచారంలో ఉన్నట్టు నగ్న సన్నివేశాలను మేం చిత్రీకరించనేలేదు. మేం తెరకెక్కించింది కొన్ని శృంగార సన్నివేశాలు. అవి అందంగా ఉంటూనే, సినిమాకు తగ్గట్టు ఉంటాయి. అంతేగానీ, మితిమీరి మేం నగ్న దృశ్యాలను తెరకెక్కించలేదు`` అని అన్నారు. పిసాసు 2 చిత్రానికి కార్తీక్ రాజా సంగీతం అందించారు. రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టి.మురుగానందం నిర్మిస్తున్నారు. ఆండ్రియా జెరీమియా, పూర్ణ, సంతోష్ ప్రతాప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో సినిమా థియేటర్లలోకి రానుంది.