English | Telugu

స‌మంత కోసం రంగంలోకి దిగిన ఓటీటీ స్టార్‌!

సంక‌ల్పం మ‌న‌లో ఉండాలేగానీ, స‌ర్వ‌శ‌క్తులూ సాయం చేస్తాయి. ఈ మాటకు నేనే పెద్ద ఎగ్జాంపుల్ అని అంటున్నారు స‌మంత రూత్ ప్ర‌భు. ఆమె న‌టిస్తున్న చిత్రం శాకుంత‌లం. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ గుడిలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు స‌మంత‌. చిత్ర క‌థానాయ‌కుడు దేవ్ మోహ‌న్ కూడా పెద్దమ్మ గుడికి స‌మంత‌తో క‌లిసి వెళ్లారు. ఇక్క‌డి నుంచి ప్ర‌మోష‌న్లు స్టార్ట్ అయిన‌ట్టే. మ‌రోవైపు స‌మంత సిటాడెల్ షూటింగ్ విష‌యంలోనూ సీరియ‌స్‌గానే ఉన్నారు. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సిటాడెల్‌లో కీ రోల్ చేస్తున్నారు స‌మంత‌. బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ ఇందులో హీరోగా న‌టిస్తున్నారు. సిటాడెల్ ఫారిన్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తున్నారు. షూటింగ్ ఆల్రెడీ పూర్త‌యింది. ఏప్రిల్‌లో విడుద‌ల కానుంది పీసీ సిటాడెల్‌.

ఇప్పుడు ఇండియ‌న్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో స‌మంత కోసం రంగంలోకి దిగేశారు శివాంకిత్ సింగ్ ప‌రిహార్‌. ఓటీటీలో శివాంకిత్ సింగ్ ప‌రిహార్‌కి చాలా గొప్ప పేరుంది. ఇప్పుడు సిటాడెల్‌లో ఆయ‌న న‌టిస్తున్నార‌ని తెలియ‌గానే చాలా మంది ఫిదా అవుతున్నారు. ఆయ‌న న‌టించిన త‌థాస్తు, హ్యాపిలీ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్‌, యాస్పిరెంట్స్, క్యూబిక‌ల్స్, సిక్స‌ర్ త‌దిత‌ర సీరీస్‌ల‌ను గుర్తుచేసుకుంటున్నారు. ఫ్యామిలీ మేన్, ఫ్యామిలీమేన్‌2, ఫ‌ర్జి సీరీస్‌ల‌తో రాజ్‌, డీకే త‌మ‌కంటూ స్పెష‌ల్ గుర్తింపు తెచ్చుకున్నారు. వారిద్ద‌రితో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా అనిపించింద‌ని చెప్పారు శివాంకిత్‌.

సిటాడెల్ ఇండియ‌న్ వెర్ష‌న్‌కి సంబంధించి రుసో బ్ర‌ద‌ర్స్ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో అనౌన్స్ చేశారు. ``ఇండియ‌న్ ఇన్‌స్టాల్‌మెంట్ గురించి ప్ర‌క‌టించ‌డం థ్రిల్లింగ్‌గా ఉంది. జ‌న‌వ‌రి నుంచి లోక‌ల్ ఒరిజిన‌ల్ స్పై సీరీస్ మొద‌ల‌వుతుంది`` అని పోస్ట్ చేశారు. సిటాడెల్ సెట్లో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చిన స‌మంత‌, ఇప్పుడు శాకుంత‌లం ప్ర‌మోష‌న్ల కోసం బ్రేక్ తీసుకున్నారు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ రాజ్‌, డీకే సెట్లో రీ జాయిన్ అవుతారు.