Read more!

English | Telugu

ఆ విషయాలు నీకెందుకు.. అభిమానిని మందలించిన షారుక్ ఖాన్ !

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ( shah rukh khan) ప్రస్తుతం డంకీ (dunki)మూవీ ఇచ్చిన విజయానందంలో ఉన్నాడు. ఈ సక్సెస్ తో హ్యాట్రిక్ విజయాన్ని కూడా అందుకున్న షారుక్ డంకీ కి సంబంధించిన రకరకాల ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు.ఈ సందర్భంలో  తాజాగా షారుఖ్  తన అభిమానులతో ముచ్చటించాడు. ఆ కార్యక్రమంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అయ్యింది.

ఎంతో అట్టహాసంగా ప్రారంభమయిన ఆ  కార్యక్రమంలో షారుక్ ఖాన్ ని ఆయన అభిమానులు రకరకాల ప్రశ్నలు అడుగుతుంటే షారుక్ వాటన్నింటికి తీరిగ్గా సమాధానాలు చెప్తున్నాడు.ఈ క్రమంలో ఒక అభిమాని డంకీ సినిమా బడ్జట్ 85 కోట్లని ఇంకొంత మంది 130 కోట్లని మరికొంత మంది అయితే  మీ రెమ్యునరేషన్ తో  కలుపుకొని  350 కోట్ల దాకా అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అసలు ఫైనల్ గా డంకీ కి ఎంత బడ్జట్ అయ్యిందని అడిగాడు. దీంతో ఒక్కసారిగా షారుఖ్ కి కోపం వచ్చింది. 

ఇలాంటి అనవసర విషయాలన్ని నీకెందుకు సినిమాకి ఎంత బడ్జట్ అయ్యిందనే విషయాన్ని దానికి సంబంధిన వాళ్ళు చూసుకుంటారు.నువ్వు ఇలాంటి విషయాలు ఆలోచిస్తు టైం వేస్ట్ చేసుకోకు అని కొంచం ఘాటుగానే చెప్పే సరికి ఒక్కసారిగా అక్కడనున్న వాళ్ళందరు సైలెంట్ అయ్యారు. గత నెల డిసెంబర్ 21 న విడుదలైన డంకీ లో షారుఖ్ తో పాటు తాప్సి (tapsee), విక్కీ కౌశల్,( Vicky Kaushal),విక్రమ్ కొచ్చర్( vikram kochhar),బొమన్ ఇరానీ ( boman irani)తదితరులు నటించారు.ఇండియన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ( raaj kumar hirani)దర్శకత్వం వహించాడు.