English | Telugu

పెళ్ల‌య్యాక కియారా రెచ్చిపోతోందిగా!


ఇంకెప్పుడు... ఇంకా ఎప్పుడు? అని వేచి చూసిన క్ష‌ణాల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. స‌త్య‌ప్రేమ్‌కీ క‌థ ట్రైల‌ర్ విడుద‌లైంది. కియారా పెళ్లి స‌మ‌యంలోనూ, పెళ్ల‌య్యాక న‌టించిన సినిమా స‌త్య‌ప్రేమ్‌కీ క‌థ‌. కార్తీక్ ఆర్య‌న్ హీరోగా న‌టించారు. వారిద్ద‌రి మ‌ధ్య ఎల‌క్ట్రిఫైయింగ్ కెమిస్ట్రీ అదుర్స్ అంటున్నారు జ‌నాలు. ఈ ఏడాది హైలీ యాంటిసిపేటెస్ మూవీస్ లిస్టులో బెస్ట్ ప్లేస్‌లో ఉంది సత్య‌ప్రేమ్‌కీ క‌థ. భూల్ భుల‌య్యా2 త‌ర్వాత కార్తిక్ ఆర్య‌న్‌, కియారా అద్వానీ మ‌ళ్లీ జోడీ క‌ట్టిన సినిమా ఇది.


ముందు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్లు విడుద‌లై వైల్డ్ ఫైర్‌లా స్ప్రెడ్ అయ్యాయి. కాస్త రొమాంటిక్‌గా సాగిన టీజ‌ర్‌కి అయితే రెస్పాన్స్ మామూలుగా లేదు. వీట‌న్నిటిని దృష్టిలో పెట్టుకునే కేక పుట్టించేలా క‌ట్ చేయించారు ట్రైల‌ర్‌ని. ఇందులో ఉన్న కంటెంట్‌ని బ‌ట్టి మూవీని ప్యూర్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కించారు అని అర్థ‌మ‌వుతోంది. మ‌న‌సును వెంటాడే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ రేంజ్‌లో ఉంది. ఈ ట్రైల‌ర్‌ని బ‌ట్టి మ్యూజిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని సందేహం లేకుండా చెప్పేయొచ్చు. లార్జ్ స్కేల్‌, మెస్మ‌రైజింగ్ విజువ‌ల్స్ తో మెప్పిస్తోంది ట్రైల‌ర్‌. పెళ్లి త‌ర్వాత ప్రేమ అనే కాన్సెప్ట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇంట్ర‌స్టింగ్‌గా తీర్చిదిద్దారు మేక‌ర్స్.


ట్రైల‌ర్ చూసిన వారంద‌రూ కార్తిక్‌, కియారా మోస్ట్ డిజైర‌బుల్‌, డిలైట్‌ఫుల్‌పెయిర్ అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. పెళ్లి త‌ర్వాత కియారాకు హిట్ ప‌క్కా అనే సిగ్న‌ల్స్ అందుతున్నాయి. కియారాను చూసి కార్తిక్ `మీరు సింగిలా?` అని అడ‌గ‌డంతో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. స‌త్య‌ప్రేమ్‌కీ క‌థ హ్యాష్‌ట్యాగ్ గురించి కూడా ఇంట్ర‌స్టింగ్ డిస్క‌ష‌న్ ఉంది ట్రైల‌ర్‌లో. కొన్ని ఎమోష‌న‌ల్ మొమెంట్స్ మాత్రం క‌ట్టిప‌డేస్తున్నాయి.


సుప్రియ పాథ‌క్ క‌పూర్‌, గ‌జ్‌రాజ్ రావు, సిద్ధార్థ్ రంధేరియా, అనూరాధ ప‌టేల్‌, రాజ్‌పాల్ యాద‌వ్‌, నిర్మితే సావంత్‌, శిఖ త‌ల్సానియా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సమీర్ విద్వాంస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. న‌దియాడ్‌వాలా గ్రాండ్‌స‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, న‌మః పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెల 29న విడుద‌ల కానుంది మూవీ.