Read more!

English | Telugu

సచిన్ కూతురు సారా టెండూల్కర్ బాలీవుడ్ ఎంట్రీ!

క్రికెట్ గాడ్ సచిన్‌ టెండూల్కర్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సారాకి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఆమె యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ తో ప్రేమలో ఉన్నట్లు రూమర్ ఉంది. ఇలా తరచూ వార్తల్లో ఉండే ఆమె తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.

మెడిసిన్ పూర్తి చేసిన సారా డాక్టర్ కి బదులుగా యాక్టర్ అవ్వాలని అనుకుంటుందట. ఇప్పటికే ఆమె మోడల్ గా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హిందీ సినిమాతో నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెకి గ్లామర్ తో పాటు ఫాలోయింగ్ ఉండటంతో గతంలోనే పలు బాలీవుడ్ నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయట. అయితే చదువు పూర్తి చేసిన తర్వాతే నటిగా మారాలని భావించిన ఆమె.. ఇప్పుడు చదువు పూర్తి కావడంతో యాక్టింగ్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 

ఇప్పటికే యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్న సారా బాలీవుడ్ ఎంట్రీ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఆమె మొదటి సినిమా షాహిద్ కపూర్ సరసన నటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.