English | Telugu
అక్షయ్ హీరోగా 'ఆకాశం నీ హద్దురా' రీమేక్.. గ్రాండ్ లాంచ్
Updated : Apr 25, 2022
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన 'సూరారై పోట్రు' మూవీ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'ఆకాశం నీ హద్దురా' పేరుతో తెలుగులోనూ విడుదలై ఆకట్టుకుంది. ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు గతేడాది అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ పూజాకార్యక్రమాలతో లాంఛ్ అయింది.
అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఒరిజినల్ వెర్షన్ ను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో సూర్య బాలీవుడ్ లో నిర్మాతగా అడుగుపెడుతుండటం విశేషం. అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ తో కలిసి 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రాధికా మదన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సోమవారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హీరో, హీరోయిన్ తో పాటు దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా నేటి నుంచి మొదలైంది.
'ఆకాశం నీ హద్దురా' సినిమా ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ గోపినాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఇందులో కెప్టెన్ గోపినాథ్ పాత్రలో సూర్య నటించి మెప్పించాడు. సూర్య నటనపై ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పుడు ఈ హిందీ రీమేక్ లో అక్షయ్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.