English | Telugu

సిటాడెల్‌ షూట్లో పాల్గొన్న సమంత

సమంత రూత్‌ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్న సీరీస్‌ సిటాడెల్‌. వరుణ్‌ ధావన్‌ మెయిన్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సీరీస్‌ షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మేడన్‌ నటిస్తున్న సిటాడెల్‌కి ఇండియన్‌ వెర్షన్‌ అది. సమంత, వరుణ్‌ధావన్‌ నటిస్తున్న సీరీస్‌ సెట్స్ నుంచి కొన్ని పిక్స్ ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సమంత ఫార్మల్‌ ఔట్‌ఫిట్‌లో కనిపించారు. పర్పుల్‌ షర్ట్, డెనిమ్‌ జీన్స్ లో ఉన్నారు సామ్‌. వరుణ్ధావన్‌ బ్రౌన్‌ టీ షర్ట్, జీన్స్ లో కనిపించారు. సమంత ఫేస్‌ సీరియస్‌గా కనిపించింది. డ్రమాటిక్‌ సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండవచ్చనే మాటలు వినిపించాయి. వరుణ్‌ ధావన్‌కీ, సమంతకి ఈ సీరీస్‌ విషయంలో ఏమైనా సలహాలిస్తారా? అని ఇటీవల ప్రియాంక చోప్రాను అడిగిత ''వాళ్లిద్దరూ ఎవరికి వారు టాలెంట్‌ ఉన్న వ్యక్తులు. ఇప్పుడు వాళ్లకి నేనేం సలహాలు ఇవ్వగలను. వాళ్లదైన తరహాలో చాలా బాగా చేస్తారని నమ్ముతున్నాను'' అని అన్నారు. రాజ్‌, డీకే సిటాడెల్‌ని తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరి డైరక్షన్‌లోనే ఫ్యామిలీ మేన్‌ 2లో రాజీ కేరక్టర్‌ చేశారు సమంత.

ఒక్క రోజు ఖాళీ దొరికినా సిటాడెల్‌ షూటింగ్‌ చేస్తూ, మధ్య మధ్యలో శాకుంతలం సినిమాను ప్రమోట్‌ చేసుకుంటున్నారు సమంత. గ్యాపుల్లో సోషల్‌ మీడియాలోనూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ట్విట్టర్‌లో ఆడియన్స్ తో మాట్లాడారు సామ్‌. గత రెండేళ్లుగా రకరకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, వాటన్నిటినీ చూశాక భవిష్యత్తులోనూ దేనికైనా సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఆమె నటించిన శాకుంతలం ఈ వారంలోనే విడుదల కానుంది. సిల్వర్‌స్క్రీన్‌ డిస్నిఫైడ్‌ అంటూ తనకు నచ్చిన జోనర్‌లో సినిమా చేశానని అన్నారు సమంత.సౌత్‌లో ఆమె విజయ్‌ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్‌ దాదాపుగా పూర్తయిందని అన్నారు డైరక్టర్‌ శివ నిర్వాణ. ఇటీవల కేరళలో షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకుంది ఖుషి.