Read more!

English | Telugu

స‌మంత రూట్లో దీపిక‌... మై క్వీన్ అంటున్న ర‌ణ్‌వీర్‌

స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుని ఏడాది అయింది. టాలీవుడ్‌లో చూడ ముచ్చ‌టి జంట‌గా పేరు తెచ్చుకున్న వారిద్ద‌రి రూట్లోనే, బాలీవుడ్ క‌పుల్ కూడా న‌డుస్తున్నారంటూ కొన్ని రోజులుగా ఒక‌టే వార్త‌లు. అయితే వాట‌న్నిటికీ ఒక్క మాట‌తో చెక్ పెట్టేశాడు ఆ హీరో. ఇంత‌కీ ఏంటి విష‌యం అంటున్నారా? చ‌దివేయండి.

దీపిక ప‌దుకోన్ త‌న క్వీన్ అని అంటున్నాడు ర‌ణ్‌వీర్ సింగ్‌. బాలీవుడ్‌లో చూడ‌చ‌క్క‌ని జంట‌ల్లో ర‌ణ్‌వీర్‌, దీపిక ప‌దుకోన్ జంట కూడా ఒక‌టి. స్టైల్ పేరిట ర‌ణ్‌వీర్ ఎన్ని ర‌కాల కాస్ట్యూమ్స్ ధ‌రించినా, దీపిక ఎప్పుడూ విసుక్కోదు. దీపికను ఆల్వేస్ స‌పోర్ట్ చేస్తుంటాడు ర‌ణ్‌వీర్‌.
అంత అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోతున్నారంటూ గ‌త కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే వాట‌న్నిటికీ ఒక్క‌మాట‌తో చెక్ పెట్టేశాడు ర‌ణ్‌వీర్‌. 

దీపిక బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఓ జువెల‌రీ బ్రాండ్ గురించి ప్ర‌స్తావిస్తూ మై క్వీన్‌, డూయింగ్ అజ్ ప్రౌడ్ (నా రాణి, మ‌మ్మ‌ల్ని గ‌ర్వ‌ప‌డేలా చేస్తోంది) అంటూ ట్వీట్ చేశాడు.ఆమెను అంత స‌పోర్ట్ చేస్తున్నందుకు దీప్‌వీర్ ఫ్యాన్స్ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.దీపిక ప‌దుకోన్ ప్ర‌స్తుతం సౌత్‌లో ప్రాజెక్ట్ కెలో న‌టిస్తోంది. బాలీవుడ్‌లో ప‌ఠాన్‌లో న‌టిస్తోంది. బ్ర‌హ్మాస్త్ర సెకండ్ పార్టులో ర‌ణ్‌వీర్, దీపిక క‌లిసి న‌టిస్తార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా స‌ర్క‌స్‌, జ‌వాన్ కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి.