కీర్తి సురేష్ బాటలో రాశీ ఖన్నా.. సొంత యూట్యూబ్ ఛానల్!
on Jan 31, 2022

పాండెమిక్ వచ్చినప్పటి నుంచి సినీ సెలబ్రిటీల ఆలోచనా విధానం మారిపోయింది. ఒకప్పుడు సినిమాలపై మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టే తారలు.. మహమ్మారి కారణంగా సినిమాలు ఆలస్యం అవుతుండటంతో ప్రేక్షకులకు దగ్గరగా ఉండటం కోసం పలు వేదికలను ఎంచుకుంటున్నారు. కొందరు టీవీ, ఓటీటీలలో షోలు, సిరీస్ లతో అలరిస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక కొందరైతే యూట్యూబ్ ఛానల్స్ ని స్టార్ట్ చేస్తున్నారు.
ఇటీవల పలువురు హీరోయిన్స్ సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు. కీర్తి సురేష్, లయ తమ పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. లయ అయితే తన ఛానల్ లో మొదటి వీడియోగా 'సారంగ దరియా' కవర్ సాంగ్ చేసి అలరించింది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ రాశీ ఖన్నా వంతు వచ్చింది.

'రాశీ ఖన్నా' పేరుతో తాను అధికారిక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినట్లు తాజాగా రాశీ ఖన్నా ప్రకటించింది. అంతేకాదు తన ఛానల్ లో మూడు నిమిషాల నిడివి గల ఓ వీడియోని కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో చిన్ననాటి జ్ఞాపకాలు, ఆహారపు అలవాట్లు, మేకప్ వంటి విషయాలను ప్రస్తావించింది. తన గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే తన ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేయాలని, యూట్యూబ్ వేదికగా తాను మరింత వినోదాన్ని పంచుతానని రాశీ ఖన్నా తెలిపింది.
కాగా, రాశీ ఖన్నా ప్రస్తుతం గోపీచంద్ సరసన 'పక్క కమర్షియల్', నాగ చైతన్య సరసన 'థాంక్యూ' సినిమాలలో నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



