Read more!

English | Telugu

ఓటీటీలో విడుద‌ల కానున్న అక్ష‌య్ సినిమా

అక్షయ్‌కుమార్‌కి ఇప్ప‌టికి తొమ్మిది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులున్నాయి. జ‌యాప‌జ‌యాలు మ‌న‌ల్నేం చేయ‌వు. మ‌న క‌ర్త‌వ్యం మ‌నం చేసుకుంటూ ముందుకు సాగాల్సిందేన‌ని అంటున్నారు అక్ష‌య్‌కుమార్‌.
బ‌చ్చ‌న్ పాండే, స‌మ్రాట్ పృథ్విరాజ్‌, ర‌క్షా బంధ‌న్‌, రామ్ సేతు, సెల్ఫీ వ‌రుస‌గా విడుద‌లై ఫ్లాప్ అయ్యాయి. అయినా అవ‌న్నీ నాకేం ప‌ట్ట‌వ‌న్న‌ట్టున్నారు అక్ష‌య్‌కుమార్‌. వాటిని ప‌ట్టించుకుంటూ కూర్చుంటే ముందుకు సాగ‌లేం అన్న‌ది అక్ష‌య్ చెబుతున్న మాట‌. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో ఓఎంజీ2, క్యాప్సూల్ గిల్‌, సూర‌రైపోట్రు రీమేక్‌, బడేమియా చోటుమియా, హెరాఫెరీ3 తో పాటు ఇంకా కొన్ని సినిమాలున్నాయి.

అక్ష‌య్ సినిమాల‌కు థియేట్రిక‌ల్ ర‌న్ రాక‌పోవ‌డంతో, ఓఎంజీ2ని ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట మేక‌ర్స్. అయితే దీని మీద మిక్స్డ్ ఒపీనియ‌న్స్ వ‌స్తున్నాయి. ఓఎంజీ2ని థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాలి. ఫ‌స్ట్ పార్టుకి స్పెష‌ల్ అభిమానులు ఉన్నారు. అలాంట‌ప్పుడు సెకండ్ పార్టుని అనామ‌కంగా ఎందుకు ఓటీటీలో విడుద‌ల చేయ‌డం అని ఓ నెటిజ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌రో ఫ్యాన్ మాత్రం ఇది మంచి డెసిష‌నే అన్నారు. చూడాల‌నుకున్న‌వారికి ఓటీటీలో అందుబాటులో ఉండం మంచిదేగా అని అన్నారు. అయితే ఇంకో నెటిజ‌న్ మాత్రం `ఫ్యాన్స్ మ‌ధ్య అభిప్రాయ బేధాల‌ను ప‌క్క‌న‌పెడితే, ఓటీటీలో విడుద‌ల చేయ‌డం మంచి నిర్ణ‌యం కాదు. అక్ష‌య్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న బాక్సాఫీస్ స‌క్సెస్‌ని ఓఎంజీ2 త‌ప్ప‌క అందిస్తుంది. ఒక‌వేళ సినిమాలో ఏమైనా కాంట్ర‌వ‌ర్షియ‌ల్ పాయింట్స్ ఉండ‌టం వ‌ల్ల‌, థియేట్రిక‌ల్ రిలీజ్ చేయ‌డం ఎందుకు అని భావిస్తే నో ప్రాబ్లం. అలాంటివేమీ లేని ప‌క్షంలో థియేట్రిక‌ల్ రిలీజ్‌కి వెళ్ల‌డ‌మే బెట‌ర్‌`` అని అన్నారు. ఓఎంజీని ఉమేష్ శుక్లా తెర‌కెక్కించారు. ఓఎంజీ2ని అమిత్ రాయ్ రూపొందించారు. 2021లో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఇప్ప‌టికీ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌లేదు మేకర్స్. ఓఎంజీ తెలుగులో గోపాల గోపాల పేరుతో రిలీజ్ అయింది.