English | Telugu
థియేటర్ లో అడుగుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నా.. తెలుగు సినిమా లెక్కలోకి రాదా
Updated : Jul 11, 2024
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ సగర్వంగా చెప్పుకునే వర్సటైల్ నటుల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin siddiqui)కూడా ఒకడు. ఎనీ క్యారక్టర్ ని తీసుకోండి. తన మార్క్ నూటికి నూరుపాళ్లు ఉంటుంది. పైగా ఆ క్యారక్టర్ గురించి ప్రేక్షకుల్లో చర్చ కూడా జరుగుతుంది. పాతిక సంవత్సరాల తన సినీ కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసాడు. స్టిల్ చేసుకుంటూనే వస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చెప్పిన విషయాలు ఆయనకున్న సినీ కమిట్మెంట్ ని తెలియచేస్తున్నాయి.
నవాజుద్దీన్ లేటెస్ట్ గా రౌత్ కా రాజ్(rautu ka raaz)అనే మూవీలో చేసాడు. థియేటర్స్ లో కాకుండా ఓటిటి వేదికగా జీ 5(zee 5)ద్వారా రిలీజ్ అయ్యింది. చూసిన ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇన్స్పెక్టర్ దీపక్ సింగ్ గా నవాజుద్దీన్ విజృంభించి నటించాడని అంటున్నారు. ఒక వైపు బాధ్యత గల పోలీసు ఆఫీసర్ గా ఉంటునే ఇంకో వైపు హాస్యాన్ని కూడా సూపర్బ్ గా పండించాడనే కితాబుని ఇస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నవాజుద్దీన్ మాట్లాడుతూ దర్శకుడు నన్ను సంప్రదించినప్పుడే నా క్యారక్టర్ కొత్తగా ఉండబోతుందని అర్ధమయ్యింది. అందుకే వెంటనే ఒకే చెప్పాను. ప్రేక్షకులు కూడా ఎప్పటికపుడు కొత్త ధనం నిండిన కథలకి, పాత్రలకి ఫిదా అవుతున్నారు.ప్రస్తుత ప్రపంచంలో ఓటిటి హవా నడుస్తుంది.నాకు నచ్చే ప్రాజెక్ట్ లు కూడా ఓటిటి లో విడుదల అయ్యే కంటెంట్ తోనే రూపొందుతున్నాయి
కానీ నేను ఓటిటి కే పరిమితమవ్వను. మంచి కంటెంట్ ఉన్న కథతో థియేటర్స్ లో అడుగుపెట్టాలనుకుంటున్నాను. ఆ రోజు కోసమే ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నవాజుద్దీన్ చెప్పిన ఈ మాటలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. అలాగే తన జీవితంలో మర్చిపోలేని కొన్ని సంఘటనల గురించి కూడా చెప్పుకొచ్చాడు.దివంగత నటి శ్రీదేవి(sridevi)తో కలిసి మామ్ చిత్రంలో నటించాను. ఆ రోజుల్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. నటనకి సంబంధించి ఎన్నో కొత్త విషయాలని ఆమె నాకు నేర్పించింది. అలాగే 2023 లో ట్రాన్సజెండర్ గా నటించిన హడ్డి సినిమాని కూడా గుర్తు చేసుకున్నాడు. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. అదే విధంగా త్వరలోనే ఒక బయోపిక్ తో రాబోతున్నానని కూడా తెలిపాడు. ఇక మొన్న సంక్రాంతికి వెంకటేష్(venkatesh)హీరోగా వచ్చిన సైంధవ్(saindhav)తో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.