English | Telugu

స్క్రిప్ట్ చ‌దివి షాక్ తిన్న మృణాల్‌... ఇంత‌కీ అందులో ఏం ఉంది?

మృణాల్ ఠాకూర్ అంటే కొన్నేళ్ల క్రితం మ‌న‌కు ప‌రిచ‌యం లేదు గానీ, సీతారామ‌మ్ సీత‌గా ఇప్పుడు మ‌నంద‌రికీ సుప‌రిచితురాలే. 600 జీతం వ‌చ్చే సైనికుడి కోసం కోట‌ల్ని వ‌దిలేసి వెళ్లిన ప్రిన్సెస్ నూర్జ‌హాన్‌గా తెలుగువారి గుండెల్లో ప‌దికాలాల పాటు ఉంటారు మృణాల్‌. ఇటీవ‌ల ఆమె వివాహం గురించి చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి.

మృణాల్ మాట్లాడుతూ ``మ‌న‌కు త‌గిన వారు దొరికితే పెళ్లి చేసుకోవ‌చ్చు. అందులో త‌ప్పేమీ లేదు. అప్ప‌టిదాకా ప‌రిచయం లేనివారు కూడా మూడు ముళ్ల బంధంతో ఒక‌టైతే, ఒక‌రికోస‌మే మ‌రొక‌రు పుట్టారా అన్న‌ట్టు మారిపోతారు. అదంతా చూడ‌టానికి చాలా ఆనందంగా ఉంటుంది`` అని అన్నారు.
ఆమె మేడ్ ఇన్ హెవ‌న్ సీజ‌న్ 2లో అదీర కేర‌క్ట‌ర్ చేశారు. జోయా అక్త‌ర్ తెర‌కెక్కించిన ప్రాజెక్ట్ ఇది.

మృణాల్ మాట్లాడుతూ `` నేను ఈ స్క్రిప్ట్ చ‌దివి ఆశ్చ‌ర్య‌పోయాను. నిజంగానే ఇలా జ‌రిగిందా అని అనుకున్నాను. నా ఫ్యామిలీలోనూ, ఫ్రెండ్స్ తోనూ దీని గురించి డిస్క‌స్ చేశాను. ఇలా జ‌రిగిన ఘ‌ట‌న‌లున్నాయ‌ని వాళ్లు నాతో చెప్పారు. ఇంకా కూడా ఇలాంటి విష‌యాల‌తో ఇబ్బంది ప‌డుతున్న వారిలో చైత‌న్యం తీసుకుని రావాల‌ని నేను అదీరా అనే కేర‌క్ట‌ర్ చేశారు. టాక్సిక్ రిలేష‌న్‌షిప్స్ లో ఎవ‌రూ ఉండాల్సిన అవ‌స‌రం లేదు. మ‌నం చాలా సంద‌ర్భాల్లో ఇత‌రుల్ని మార్చేయ‌గ‌ల‌మ‌ని అనుకుంటాం. అది త‌ప్పు. ఎవ‌రికి వారే మారాలి. వారి ప్ర‌యారిటీస్ వాళ్ల‌కు తెలియాలి. ఈ జీవిత‌మంతా ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలంటే, ఎన్నాళ్లు ఇస్తూ ఉంటాం. అందులో అర్థం లేదు. అమ్మాయిల‌కు ప్రేమ చాలా ముఖ్యం.ఒక చోట కాక‌పోతే, మ‌రోచోట ప్రేమ ల‌భిస్తుంది. ఆనందంగా ఉంటారు.అలాంటి విష‌యాల‌న్నిటి గురించీ ఇందులో చ‌ర్చించాం`` అని అన్నారు.