English | Telugu
షారూఖ్ తో కియారా చిందులు.. ఏ సినిమా కోసమో తెలుసా!
Updated : Jul 15, 2023
కియారా అద్వాని.. తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్న ఉత్తరాది భామ. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జోడీగా 'భరత్ అనే నేను'లో ఎంటర్టైన్ చేసిన కియారా.. ఆపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వినయ విధేయ రామ'లోనూ సందడి చేసింది. ఆనక బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా మారిన ఈ అమ్మడు.. ప్రస్తుతం రామ్ చరణ్ తో సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో యాక్ట్ చేస్తోంది. నిర్మాణ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రాబోతోంది.
ఇదిలా ఉంటే, తాజాగా కియారా అద్వానికి ఓ భారీ బడ్జెట్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ దక్కిందట. ఆ సినిమా మరేదో కాదు.. షారూఖ్ ఖాన్ తాజా హిందీ చిత్రం 'జవాన్'. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార నాయికగా నటించగా.. ఓ ప్రత్యేక గీతంలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకోన్ నర్తించింది. ఇక ఇదే చిత్రంలో మరో స్పెషల్ సాంగ్ కి స్కోప్ ఉందని.. అందులో షారూఖ్ తో కియారా చిందులేసిందని సమాచారం. ముంబయిలోని యశ్ రాజ్ ఫిల్మ్స్ స్టూడియోలో వారం రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగిందని బాలీవుడ్ టాక్. మరి.. షారూఖ్ తో చేసిన ఈ స్పెషల్ సాంగ్ కియారాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన 'జవాన్'.. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.