English | Telugu
నేను సేఫ్ అంటున్న బాస్ పార్టీ భామ!
Updated : Jul 15, 2023
బాస్ పార్టీతో రీసెంట్‌గా మెప్పించిన నాయిక ఊర్వశి రౌతేలా. తన గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాను సేఫ్‌గానే ఉన్నానని అంటోంది. ఇంతకీ ఊర్వశి రౌతేలాకు ఏమైంది? ఆమె ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ ఎందుకు ఆందోళన పడుతున్నారు? అని అనుకుంటున్నారా? అయితే మీరు ఫ్రాన్స్ లో జరిగిన కాల్పుల గురించి తెలుసుకోవాల్సిందే. ఫ్రాన్స్ లో ఇటీవల వెహికల్స్ చెక్ చేస్తుండగా కాల్పులు జరిగి ఓ కుర్రాడు మృతి చెందాడు. దాంతో అక్కడ పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ గొడవల్లో 350 మందిని అరెస్ట్ చేశారు. ఈ వాహనాలకు సీల్ వేశారు. ఈ ఘటన జరుగుతున్నప్పుడు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్యారిస్‌లో ఉన్నారు. దీని గురించి ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ లో స్పందించారు.
``ప్యారిస్‌లో జరిగిన గొడవలు, హింసలకు సంబంధించిన వార్తలు మీరందరూ చూస్తూనే ఉంటారు. ఈ పరిస్థితుల్లో నేనిక్కడ ఉండటం మా కుటుంబ సభ్యులకు, ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. నేను జాగ్రత్తగా ఉన్నానా? లేనా? అని వాళ్లు కంగారు పడుతున్నారు. నేను, నాతో వచ్చిన టీమ్ భద్రంగా ఉన్నాం. ప్యారిస్ చాలా అందమైన ప్రదేశం. ఇలాంటి ప్రదేశంలో గొడవలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి`` అని అన్నారు.
నార్త్ లో నటిగా వరుస సినిమాలు చేస్తున్న ఊర్వశి రౌతేలా సౌత్ లో మాత్రం స్పెషల్ సాంగులు చేస్తున్నారు. ఏరోనాటికల్ ఇంజినీర్‌గానా, ఐఏఎస్ కానీ కావాలనుకునేవారు ఊర్వశి. ప్లస్‌టూలో 97 శాతం మార్కులతో ఏఐఈఈఈకి ప్రిపేర్ అయ్యారు ఊర్వశి. కానీ ఆమె అనూహ్యంగా గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టారు. ఇటీవల దాదాపు 200 కోట్లతో ముంబైలోని జుహు ఏరియాలో ఇల్లు కట్టుకున్నారు ఊర్వశి రౌతేలా. పుష్ప2లో ఆమె చేసే ఐటమ్ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అల్లుఆర్మీ.