Read more!

English | Telugu

హిందీలో ఐదు రోజుల్లో 200 కోట్లు.. 'బాహుబలి-2' రికార్డు బ్రేక్

'కేజీఎఫ్ చాప్ట‌ర్‌ 2' హిందీలో కలెక్షన్ల తుఫాను సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరి 'బాహుబలి-2' రికార్డును బ్రేక్ చేసింది. ఈ ఫీట్ సాధించడానికి 'బాహుబలి-2'కి ఆరు రోజులు పడితే 'కేజీఎఫ్ 2'కి ఐదు రోజులే పట్టడం విశేషం.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం హిందీలో కేజీఎఫ్-2 ఐదు రోజుల్లో 219.56 కోట్ల నెట్ వసూలు చేసింది. మొద‌టిరోజు గురువారం రూ.53.95 కోట్ల‌తో స‌రికొత్త రికార్డును సృష్టించిన కేజీఎఫ్-2.. ఆ త‌ర్వాత శుక్ర‌వారం రూ. 46.79 కోట్లు, శ‌నివారం రూ. 42.90 కోట్లు, ఆదివారం 50.35 కోట్లు, సోమవారం 25.57 కోట్లు రాబట్టింది. 'బాహుబలి-2' హిందీలో మొదటివారం 247 కోట్ల నెట్ రాబట్టగా.. కేజీఎఫ్-2 దాదాపు 260 కోట్ల నెట్ కలెక్ట్ చేసే అవకాశముంది.

త్వరలోనే హిందీలో 300 కోట్ల క్లబ్ లో చేరే అవకాశమున్న కేజీఎఫ్-2.. ఫుల్ రన్ లో బాహుబలి-2 లాగా 500 కోట్ల క్లబ్ లో చేరి రేర్ ఫీట్ సాధిస్తుందేమో చూడాలి. హిందీలో బాహుబలి-2 ఫుల్ రన్ లో 510 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది.