English | Telugu

వైర‌ల్ అవుతున్న క‌రీనా క‌పూర్ 'గృహ‌ప్ర‌వేశం' ఫొటో!

కొత్త ఇంటిలో గృహ‌ప్ర‌వేశం వేడుక‌కు సిద్ధం చేస్తున్న క‌రీనా క‌పూర్ ఫొటో ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది. రీసెంట్‌గా ఆమె రిలీజ్ చేసిన సెల్ఫ్‌-హెల్ప్ బుక్ 'క‌రీనా క‌పూర్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' నుంచి ఆ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఫొటోలో కిచెన్‌లో స్ట‌వ్‌పై పాలు పొంగిస్తోంది క‌రీనా. ప‌క్క‌నే ఒక ప‌ళ్లెంలో పూలు పెట్టి వున్నాయి. ఆమె నిండు గ‌ర్భంతో క‌నిపిస్తోంది. కరీనా, ఆమె భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ త‌మ రెండో కుమారుడు జహంగీర్‌కు జన్మనివ్వడానికి కొన్ని వారాల ముందు ముంబైలోని బాంద్రా శివారులో కొన్న‌ కొత్త ఇంటికి వెళ్లారు.

బాబు పూర్తి పేరు త‌న పుస్త‌కంలో వెల్ల‌డించింది క‌రీనా. రెండో చిన్నారి త‌మ జీవితంలోకి వ‌స్తుండ‌టాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ బాబుకు అద‌నంగా ఇంకో రూమ్ కావాల్సి వ‌స్తుంద‌నే ఉద్దేశంతో వారు కొత్త ఇంటికి మారారు. "నిజానికి వారు ఇప్ప‌టిదాకా ఉన్న ఫార్చ్యూన్ హైట్స్‌లోని ఇల్లు చాలా సౌక‌ర్యంగానే ఉంది. మొద‌ట అక్క‌డ్నుంచి క‌ద‌లాల‌ని వారు అనుకోలేదు. కానీ రెండో బిడ్డ వారి జీవితాల్లోకి వ‌స్తుండ‌టంతో మ‌రికొంత స్పేస్ కావాల‌నుకొని మారారు. కొత్త ఇంట్లో జ‌హంగీర్ కోసం అంద‌మైన ప్లేస్‌ను ఏర్పాటుచేశారు. పెద్ద కొడుకు తైమూర్‌కు కూడా ఓ రూమ్ ప్ర‌త్యేకంగా ఉంది. పాత ఇంటితో పోల్చుకుంటే కొత్త ఇల్లు బాగా పెద్ద‌ది. బ్యూటిఫుల్ టెర్రేస్‌లు, ఒక స్విమ్మింగ్ పూల్‌, చ‌క్క‌ని ల్యాండ్‌స్కేప్‌తో తీర్చిదిద్దిన ఓపెన్ స్పేస్‌లు కొత్త ఇంటిలో ఉన్నాయ"ని క‌రీనా, సైఫ్‌ల డిజైన‌ర్ తెలిపారు.

క‌రీనా సైతం కొత్త ఇంటి లోప‌ల ఎలా ఉందో చూపుతూ ఫొటోలు, వీడియోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఆమె షేర్ చేసిన వాటిలో అతిథులు వ‌స్తే వారితో కూర్చొని మాట్లాడుకోవ‌డానికి పొడ‌వాటి బాల్క‌నీ, ఫోర్‌-పోస్ట‌ర్ బెడ్ వున్న బెడ్‌రూమ్‌, బుక్ షెల్ఫులు ఉన్న లివింగ్ రూమ్ వంటివి క‌నిపిస్తున్నాయి.