Read more!

English | Telugu

ఫ్యాన్స్‌ని ఊరిస్తున్న క‌రీనా చాక్లెట్ బ్రౌనీ!

వంద మాట‌లు చెప్ప‌లేని విష‌యాన్ని ఒక్క ఫొటో చెబుతుంద‌ని అంటారు. లేటెస్ట్‌గా క‌రీనా క‌పూర్ రిలీజ్ చేసిన ఫొటోలు కూడా ఇలాంటి విష‌యాన్నే వ్య‌క్తం చేస్తున్నాయి. త‌న‌లోని బాస్ లేడీని బ‌య‌ట ప్ర‌పంచానికి చూపించే ప్ర‌య‌త్న‌మే చేశారు క‌రీనా ఈ ఫొటో షూట్‌లో. కాసింత గ్లామ‌ర్ పాళ్లు ఎక్కువ‌గా క‌నిపించినా, చూడ్డానికి ట్రెండీగా అనిపిస్తున్నాయి ఫొటోలు. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయితే ఫ‌ర్వాలేదు. ఏకంగా క‌రీనా జూనియ‌ర్స్, మ‌న‌కు బాగా ప‌రిచ‌య‌మైన త‌మ‌న్నా, ర‌కుల్ కూడా సో హాట్ అంటూ రియాక్ట్ అయ్యారు.

సౌత్‌లో మ‌న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్‌కి ఎలా బ్రాండ్ అంబాసిడ‌రో, నార్త్ ఫీమేల్ ఫ్రెట‌ర్నిటీలో ఆ పోస్ట్ క‌రీనాక‌పూర్‌దే. ఎప్పుడూ బ‌బ్లీగా, చియ‌ర్‌ఫుల్‌గా ఉంటారు క‌రీనా క‌పూర్ ఖాన్‌. అంత నాజూగ్గా ఉన్నా తిండి ద‌గ్గ‌ర మాత్రం త‌గ్గేదేలే అని ఇప్ప‌టికే చాలా సార్లు ప్రూవ్ చేశారు క‌రీనాక‌పూర్‌. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త డిషెస్ పేర్ల‌తో ఫ్యాన్స్ ని ఆక‌ట్టుకునే క‌రీనా క‌పూర్‌, ఇప్పుడు త‌న తాజా డెలీషియ‌స్ క్రేవింగ్ పేరు చెప్పేశారు. చాక్లెట్ బ్రౌనీస్‌ని చాలా ఇష్టంగా తిన‌డం మొద‌లుపెట్టార‌ట క‌రీనాక‌పూర్‌. ``ఇవాళ రాత్రికి నేను చాక్లెట్ బ్రౌనీని తిన‌బోతున్నాను. మ‌రి మీ సంగ‌తేంటి?`` అంటూ సోష‌ల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్టుతో, ఆమెకు చాక్లెట్ బ్రౌనీల మీద పెరిగిన ఇష్టం ఎస్టాబ్లిష్ అయింది. మేం కూడా రెడీ మేడ‌మ్ అని కొంద‌రు అంటే, మీకేంటండీ రాత్రి చాక్లెట్ బ్రౌనీలు తిని, ప‌గ‌లు పైలేట్స్ తోనూ, యోగాతోనూ క‌రిగించేస్తారు. కానీ మాకు అలా కుద‌రదు మేడ‌మ్ అని మ‌రికొంద‌రు త‌మ‌కు న‌చ్చిన‌ట్టు రిప్లైలు పెడుతున్నారు. ఫ్యాన్స్ ని ఎలా ఎంగేజ్ చేయాలో క‌రీనాకి చాలా బాగా తెలుసని అంటున్నారు సోష‌ల్ మీడియా అబ్జ‌ర్వ‌ర్స్.