Read more!

English | Telugu

టైగ‌ర్ 3 సెన్సార్ పూర్తి... రెండు పదాల‌తో చిక్కులు!


స‌ల్మాన్ ఖాన్ న‌టించిన సినిమా టైగ‌ర్ 3. ఈ సినిమా రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకో తొమ్మిది రోజుల్లో సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, ఇమ్ర‌న్ హ‌ష్మి న‌టించిన సినిమా టైగ‌ర్‌3. ఈ సినిమాను య‌ష్ రాజ్ ఫిల్మ్స్ ప్రెస్టీజియ‌స్‌గా తెర‌కెక్కించింది. ఈ దీపావ‌ళికి థియేట‌ర్ల‌లో మోత మామూలుగా ఉండ‌దు అని చెప్పి మ‌రీ కాసులు కొల్ల‌గొట్ట‌డానికి రెడీ అవుతోంది టీమ్‌. ఈ సినిమా సెన్సార్ పూర్త‌యింది. విజువ‌ల్స్ క‌ట్స్ అస‌లేమీ చెప్ప‌లేదట సెన్సార్‌. కాక‌పోతే బేవ‌కూఫ్ అనే ప‌దాన్ని మ‌ష్రూఫ్ అని, ఫూలిష్ అనే ప‌దాన్ని బిజీ అని మాత్రం స‌బ్‌టైటిల్స్ లో మార్పు చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింద‌ట‌. కొన్నిచోట్ల ఆడియో క‌ట్స్ కూడా ఇచ్చింద‌ట సెన్సార్‌. కొన్ని డైలాగుల్లో `రా`కి ఉన్న అబ్రివేష‌న్‌ని క‌రెక్ట్ చేయ‌మ‌ని సూచించింద‌ట‌. ఈ చేంజెస్ అన్నీ చేశాక యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చింద‌ట సెన్సార్ బోర్డ్. 153 నిమిషాల ర‌న్ టైమ్ ఉంది. అంటే రెండు గంట‌ల 33 నిమిషాల నిడివితో టైగ‌ర్‌3 విడుద‌ల కాబోతోంది. న‌వంబ‌ర్ 12న రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం జ‌నాలు ఈగ‌ర్‌గా వెయిటింగ్‌.

స‌ల్మాన్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో షారుఖ్ కూడా గెస్ట్ రోల్ చేశారు. ఇప్ప‌టికే ఈ ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేశారు షారుఖ్‌. ఇప్పుడు ఈ సినిమా కూడా వెయ్యి కోట్ల మార్కు ట‌చ్ చేస్తే, ఇందులో ఉన్న షారుఖ్‌కి కూడా క్రెడిట్ ఇచ్చి తీరాల్సిందేన‌న్న‌ది ఫ్యాన్స్ మాట‌.

ఏక్‌థా టైగ‌ర్‌, టైగ‌ర్ జిందా హై, వార్‌, ప‌ఠాన్ సినిమాల‌ను తెగ ప్రేమిస్తున్న స్పై యూనివ‌ర్శ్ ప్రేక్ష‌కులు ఇప్పుడు టైగ‌ర్‌3 కోసం కూడా అంతే ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. నార్త్ వాళ్ల‌తో పాటు సౌత్ వాళ్లు కూడా ఇష్టంగా ఎదురుచూస్తున్న మ‌రో ప్రాజెక్ట్ వార్‌2. హృతిక్ తో పాటు జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా వార్‌2.