Read more!

English | Telugu

తొలిరోజు దుమ్ము రేపిన ‘జవాన్’

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జవాన్’. ఈ మూవీ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. అంచనాలకు తగ్గట్టే సినిమా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర తొలిరోజున ఈ చిత్రంవసూళ్ల సునామీని సృష్టించింది. మూడు భాషల్లో కలిపిి 75 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్స్‌ను రాబట్టింది. నార్త్‌లో  65 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ రాగా..తమిళంలో 6.41 కోట్ల రూపాయలు.. తెలుగులో 5.29 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్ వచ్చాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటి వరకు ఉన్నపఠాన్ కలెక్షన్స్ సహా ఇతర బాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ రికార్డ్స్‌ని ఇది బద్దలు కొట్టి సరికొత్త చరిత్రను క్రియేట్ చేయటం విశేషం.

కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జవాన్’ కలెక్షన్స్ కంటే ముందు పఠాన్ తొలిరోజున  55 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టగా, తర్వాత స్థానంలో కెజియఫ్ 2 సినిమా 54  కోట్ల రూపాయలతో నిలిచింది. బాహుబలి సినిమా 41 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. తొలిరోజు కలెక్షన్స్ పరంగా ఈ రికార్డులను జవాన్ క్రాస్ చేసి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. రీసెంట్ టైమ్‌లో సౌత్ మార్కెట్‌పై ఫోెకస్ చేస్తోన్న షారూఖ్.. జవాన్ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేశా

మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్ అయిన అట్లీ తనదైన పంథాలో జవాన్ చిత్రాన్ని పక్కా కమర్షియల్ మూవీగా ఆవిష్కరించారు. హీరో ఎలివేషన్ సీన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులన్నీ ఆడియెన్స్‌ని అలా కట్టిపడేశాయి. సౌత్ ప్రేక్షకులకు ఇలాంటి కమర్షియల్ సినిమాలు కామన్. కానీ నార్త్ ఆడియెన్స్‌కి సినిమా బాగా ఎక్కేసింది. ఫ్యాన్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి.

ఈ ఏడాది జనవరిలో షారూఖ్ హీరోగా నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఆ మూవీ వెయ్యి కోట్ల రూపాయలను రాబట్టింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారూఖ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ ఆయనకు సరైన కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. దీని తర్వాత అట్లీతో జవాన్ మూవీని అనౌన్స్ చేశారు. దానికి తోడు సినిమా ప్రోమో, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక సిల్వర్ స్క్రీన్ పై అంచనాలకు ధీటుగా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్స్ ముందు క్యూ కట్టారు ఆ ఎఫెక్ట్ తొలిరోజునే వసూళ్ల రూపంలో తెలిసిపోయింది. ఇదే జోరుతో సినిమా వెయ్యి కోట్ల మార్కును క్రాస్ చేస్తుంది ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.