Read more!

English | Telugu

జాన్వీ బాయ్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌ ఇంత పెద్దదా.. షాక్‌ అవుతున్న సినీవర్గాలు!

సినిమా తారలకు ఎఫైర్స్‌ అనేవి సర్వసాధారణమైన విషయం. అందులోనూ బాలీవుడ్‌ తారలైతే తమకు ఎవరితో ఎఫైర్‌ ఉంది అనే విషయాన్ని చాలా ఓపెన్‌గా చెబుతుంటారు.  ఈ విషయంలో ఇప్పుడు జాన్వీ కపూర్‌ బాగా హైలైట్‌ అవుతోంది. అయితే జాన్విపై ఎఫైర్‌ రూమర్స్‌ రావడం కొత్తేమీ కాదు. టీనేజ్‌ నుంచే ఈమెపై ఇలాంటి రూమర్స్‌ ఉన్నాయి. ఈమధ్య జాన్వీకి లింక్‌ చేస్తూ శిఖర్‌ పహరియా పేరు బాగా వినిపిస్తోంది. తాజాగా శిఖర్‌ వేసిన పోస్ట్‌ ఈ చర్చకు దారి తీస్తోంది. 

ఇక జాన్వీ కపూర్‌ బాయ్‌ ఫ్రెండ్స్‌కి సంబంధించి పెద్ద లిస్టే వుంది. సినిమాల్లోకి రాకముందు ఆమెకు చాలా మందితో పరిచయాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా ‘ధడక్‌’లో హీరోగా నటించిన ఇషాన్‌ ఖత్తర్‌, అక్షత్‌ రాజన్‌, కార్తీక్‌ ఆర్యన్‌... ఇలా ఆమె బాయ్‌ఫ్రెండ్స్‌ లిస్ట్‌ కొనసాగుతోంది. ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు శిఖర్‌ పహరియా. వీరిద్దరి మధ్య చాలా కాలంగా పరిచయం ఉంది. అయితే వీరు బ్రేకప్‌ అయ్యారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్త నిజం కాదని ప్రూవ్‌ చేస్తూ ఇద్దరూ చెట్టా పట్టాలేసుకొని తిరుగుతూ కనిపించారు. దీంతో వీరి రిలేషన్‌ గురించి రూమర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. శిఖర్‌, జాన్వీ తరచూ డిన్నర్‌ డేట్స్‌కి వెళుతుంటారు. బాలీవుడ్‌ సెలబ్రిటీస్‌ ఇచ్చే పార్టీలకు ఇద్దరూ జంటగా హాజరవుతుంటారు. అంతేకాదు, జాన్వీ తన ఫ్యామిలీతో వెళ్లిన ట్రిప్‌లో కూడా శిఖర్‌ కనిపిస్తుంటాడు. ఆమధ్య జాన్వీ తిరుమల వచ్చినపుడు కూడా ఆమెతోపాటు శిఖర్‌ ఉన్నాడు. వీరికి సంబంధించి ఇలాంటి వార్తలు ఎన్ని వచ్చినా ఇద్దరూ ఏ సందర్భంలోనూ స్పందించలేదు. అసలు ఆ వార్తల గురించి పట్టించుకోలేదు. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో శిఖర్‌ వేసిన పోస్ట్‌లో జాన్వీతో తన లవ్‌ కన్‌ఫర్మ్‌ చేశాడట. దాంతో సినీవర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. 

ఇటీవల వీరిద్దరి మధ్య ఓ అపార్థం చోటు చేసుకుందట. ఓ పార్టీలో శిఖర్‌ ఓ అమ్మాయితో డాన్స్‌ చేశాడట. అది సోషల్‌ మీడియాలో వచ్చింది. దానిపై జాన్వీకి చాలా కోపం వచ్చింది. ఆ పోస్ట్‌ కింద ‘ఎవరు ఆ పింక్‌ గర్ల్‌?’ అని కామెంట్‌ చేసింది. దానికి శిఖర్‌ సమాధానం చెప్పకపోవడంతో వీరిద్దరి కామన్‌ ఫ్రెండ్‌ అయిన ఒర్రి ‘పరుగెత్తు’ అని జాన్వీని ఉద్దేశించి కామెంట్‌ చేశాడు. ఆ కామెంట్‌ చూసి జాన్వీ మరింత మండిపడిరది. దానికి ఒర్రి వివరణ ఇస్తూ నిన్ను నువ్వు కాపాడుకో అనే అర్థంతో అలా కామెంట్‌ చేశానని అన్నాడు. ఏది ఏమైనా జాన్వీ కెరీర్‌ ప్రారంభంలోనే ఇన్ని ఎఫైర్స్‌తో వార్తల్లో నిలుస్తుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.