English | Telugu

మెల్బోర్న్ ఫెస్టివ‌ల్‌లో ఘూమ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 14వ ఎడిషన్ అనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది. ఆగ‌స్టు 11 నుంచి 20 వ‌ర‌కు ఈ ఫెస్టివల్ జ‌ర‌గ‌నుంది. ఈ చ‌ల‌న‌చిత్రోత్స‌వానికి ఈ సారి ఆర్ బాల్కీ సినిమా ఘూమ‌ర్ ఎంపికైంది. అభిషేక్ బచ్చన్, సయామి ఖేర్, అంగద్ బేడి మరియు షబానా అజ్మీ నటించిన మూవీ ఘూమర్‌. అభిషేక్ బచ్చన్ కోచ్‌గా క‌నిపిస్తారు. తన కోచ్ మార్గదర్శకత్వంలో క్రికెటర్‌గా రాణించిన అమ్మాయిగా సయామి ఖేర్ క‌నిపిస్తారు. ఆర్ బాల్కీ, అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ ``మెల్బోర్న్ ఫెస్టివ‌ల్‌లో ఘూమర్ ఓపెనింగ్ మూవీ కావడం నిజంగా మాకు గౌరవంగా ఉంది. ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ను కూడా అడ్వాంటేజ్‌గా మార్చుకునే కథే ఘూమర్. ప‌డ్డ‌ప్పుడు లేవాల‌ని చెప్పే క‌థ ఇది`` అని అన్నారు.

సయామీ ఖేర్ మాట్లాడుతూ ``ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్‌లో ఘూమర్ ప్రారంభ చిత్రం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. గౌర‌వంగా భావిస్తున్నాను. నా మనసుకు చాలా దగ్గరైన సినిమా ఇది. స్పోర్ట్స్ సినిమాలు బాగా ఆడాలి. ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకోవాలి. విపరీతమైన కష్టాల్లో విజయం సాధించిన కథ ఇది. నేను చేసిన సినిమాల్లో శారీరకంగా, మానసికంగా చాలా డిమాండ్ చేసిన‌ సినిమా ఇది`` అని చెప్పారు.