English | Telugu

ఎయిర్ పోర్ట్ లో స్టెప్పులు వేసిన తమన్నా

తమన్నా ఆనందానికి ఇప్పుడు అవధులే లేవు. మిల్కీ బ్యూటీ ఇప్పుడు స్కై హై లో ఉన్నారు. ఆమె నటించిన జీ క‌ర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2 నెటిజన్ల ఆదరణ పొందాయి. డిజిటల్ వ్యూస్ బాగా ఉన్నాయి షోస్ కి. ఇప్పుడు ఆమె నటించిన వా కావాలా పాట సౌత్లో హల్చల్ చేస్తోంది. రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్‌ సినిమాలోని పాటది. సూపర్ స్టార్ పక్కన నటించడం ఆనందంగా ఉందని ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పారు తమన్నా. ఆయనతో నటించిన జైలర్ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ విడుదల అయింది. ఈ పాటను మేకర్ తమన్నా పాట గానే పిలుస్తున్నారు.

ఈ పాటకు ఆమె వేసిన స్టెప్పులు చూసి వావ్ అంటున్నారు ఫిమేల్ ఫ్యాన్స్. తమన్నా కావాలా పాటకు ఎయిర్ పోర్టులో స్టెప్ వేశారు. ఎయిర్ పోర్టులో ఒక ఫోటోగ్రాఫర్ తో కలిసి ఆమె చేసిన డాన్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఓవైపు ఫ్లైట్ కి టైం అవుతున్నప్పటికీ, ఒక ఫోటోగ్రాఫర్ తమన్నను కావాలా పాటకు డాన్స్ వేయాలి అని అప్రోచ్ అయ్యారు. అతని కోరికను మన్నించిన తమన్నా వెంటనే అతనితోపాటు స్టెప్పులేసి మీడియాకు థాంక్స్ చెప్పారు. అంతేకాకుండా ఆమెతో కలిసి స్టెప్పులు వేసిన ఫోటోగ్రాఫర్ ఉద్దేశించి తనకన్నా అతను చాలా బాగా డాన్స్ వేస్తున్నారని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు.

ఇటు తమన్నా నటించిన భోళాశంకర్ కూడా అదే టైంకి రిలీజ్ కి రెడీ అవుతుంది. ఆగస్టు 11న విడుదల కానుంది భోళాశంకర్. ఆగస్టు పదిన విడుదల కానుంది జైలర్. బ్యాక్ టు బ్యాక్ వరుసగా డే బై డే రెండు సినిమాలు రిలీజ్ లు చూడబోతున్నారు తమన్న. ఒకటి తెలుగు మెగాస్టార్ చిరంజీవితో కాగా, మరొకటి తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ తో. ఈ రెండు సినిమాల సక్సెస్ లు తమన్నకి ఎంతో కీలకమైనవి.

జైలర్ సినిమాలో ఆమెకున్న ఇంపార్టెన్స్ ఇప్పుడు రిలీజ్ అయిన పాట‌ను బట్టి అర్థమవుతుంది. ఇటు తెలుగులో ఆమె మెగాస్టార్ పక్కన నటించ‌డం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు సైరా లో నటించారు తమన్నా. అప్పుడు ఆమెతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు నయనతార. ఇప్పుడు ఆమెతోపాటు భోళా శంకర్ లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కీర్తి సురేష్. చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్నారు కీర్తి సురేష్.