Read more!

English | Telugu

'ఫైటర్' ఫస్ట్ రివ్యూ.. ఇది అసలు ఊహించలేదు..!

'బ్యాంగ్ బ్యాంగ్', 'వార్' తర్వాత బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా 'ఫైటర్'(Fighter). హిట్ కాంబో కావడం, పైగా 'పఠాన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో 'ఫైటర్'పై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. దీపికా పదుకొనే, అనిల్ కపూర్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా నేడు(జనవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ ఫిల్మ్ కి క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది.

'ఫైటర్'లో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయట. డ్రామా కూడా అద్భుతంగా పండిందట. దేశభక్తితో కూడిన ఈ యాక్షన్ ఫిల్మ్ విజువల్ వండర్ లా ఉందని, బిగ్ స్క్రీన్ పై కొత్త అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ అంతకుమించి ఉందని అంటున్నారు. హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రజెన్స్ హైలైట్ గా నిలిచిందని, హృతిక్-దీపిక జోడి స్క్రీన్ పై మ్యాజిక్ చేసిందని అభిప్రాయపడుతున్నారు. డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తన రైటింగ్, మేకింగ్ తో ఆకట్టుకున్నాడట. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన ఖాతాలో మరో హిట్ పడినట్లే అని చెప్పుకుంటున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఎందుకనో 'ఫైటర్' సినిమా హృతిక్ రోషన్, సిద్దార్థ్ ఆనంద్ కాంబో స్థాయికి తగ్గ రెస్పాన్స్ ని తెచ్చుకోలేకపోయింది. అయితే ఇప్పుడు సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ ని బట్టి చూస్తే ఫుల్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమనిపిస్తోంది.